Xiaomi: భారీ బడ్జెట్‌లో Mi 11 మోడల్స్ లాంఛ్ చేసిన షియోమీ, ధర, ఫీచర్లు ఫూర్తి వివరాలివే

Xiaomi Mi 11 Price In India, Features And Other Details:

Written by - Shankar Dukanam | Last Updated : Feb 9, 2021, 01:19 PM IST
  • ఆన్‌లైన్ వేదికగా Mi 11 మొబైల్‌ మోడల్‌ని ప్రపంచవ్యాప్తంగా విడుదల
  • ఎంఐ 11 డిసెంబర్ 2020 చివరి వారంలో లాంఛ్ చేశారు
  • ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది
Xiaomi: భారీ బడ్జెట్‌లో Mi 11 మోడల్స్ లాంఛ్ చేసిన షియోమీ, ధర, ఫీచర్లు ఫూర్తి వివరాలివే

Xiaomi Mi 11 Price In India, Features And Other Details: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ ఎట్టకేలకు ఆన్‌లైన్ వేదికగా Mi 11 మొబైల్‌ మోడల్‌ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఎంఐ 11 డిసెంబర్ 2020 చివరి వారంలో లాంఛ్ చేశారు. ప్రస్తుతం భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా కొత్త మొబైల్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది షియోమీ. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఎంఐ స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్ మోడల్స్‌ను Xiaomi తీసుకొస్తుంది. 55W GaN ఛార్జర్ అందిస్తోంది. MIUI 12.5 Mi 11తో పాటు ఎంఐ 10 సిరీస్, రెడ్‌మి నోట్ 9 సిరీస్(Redmi Note 9 series) మరియు రెడ్‌మి 9 సిరీస్ వంటి ఇతర మోడళ్లను ప్రకటించింది. సెల్ఫీలు కోసం 20MP ఫ్రంట్ కెమెరా,  రెగ్యూలర్ కెమెరా కోసం 108MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 5 MP మాక్రో కెమెరాsతో ట్రిపుల్ రియర్ కెమెరా  సెటప్ ఉంది. 

Also Read; EPFO: జాబ్ మానేసిన ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్, ఇకనుంచి పాత కంపెనీతో పనిలేదు

 

ఎంఐ 11 ఫీచర్లు ఇవే (Mi 11 Specifications)
- ఎంఐ 11 6.81-అంగుళాల 3200 × 1440 అమోలెడ్ డిస్‌ప్లే
- 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 480 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్
- 55W వైర్‌డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్.
- 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ 
- బ్యాటరీ సామర్థ్యం 4,600 mAh 
- ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 12.5 అవుట్-ఆఫ్-బాక్స్ 
- క్లౌడ్ వైట్, హారిజాన్ బ్లూ మరియు మిడ్‌నైట్ గ్రే రంగులలో లభ్యం కానుంది

Also Read: Recharge Plans: ఎయిర్‌టెల్, Jio మరియు Vi అందిస్తున్న బెస్ట్ డేటా, కాలింగ్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

భారత్‌లో ఎంఐ 11 ధర (Mi 11 Price In India)
8 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌  ఎంఐ 11 ధర 749 యూరోలు (భారత కరెన్సీలో సుమారు రూ .65,800)గా నిర్ణయించారు. కాగా, 8 జీబీ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 799 యూరోలు (భారత కరెన్సీలో సుమారు రూ.70,100). ఈ మొబైల్స్‌కు రెండేళ్ల వరకు వారంటీ, ఒకసారి స్క్రీన్ రిప్లేస్‌మెంట్ అందిస్తోంది.

Also Read: EWS Reservation: ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరెవరు పొందవచ్చు, ఈ కండీషన్స్ తెలుసుకోండి 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News