Sheikh Hasina First Speech: దేశంలో చెలరేగిన హింసాత్మక సంఘటనలతో పదవికి రాజీనామా చేసిన భారతదేశంలో శరణార్థిగా బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనా తొలిసారి నోరు విప్పారు. స్వదేశంలో ప్రభుత్వం కుప్పకూలడం.. దేశంలో వ్యవస్థలు కుప్పకూలడంతో కట్టుబట్టలతో భారత్‌కు వచ్చి షేక్‌ హసీనా తల దాచుకుంటున్నారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు సద్దుమణిగి అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే శరణార్థిగా వచ్చిన తొలిసారి షేక్‌ హసీనా నోరు విప్పారు. తమ దేశంలో హింసాత్మక సంఘటనలకు కారణాలు, తన భవిష్యత్‌ ప్రణాళిక వంటి అంశాలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Brazil Plane Crash: బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం.. విమానంలోని మొత్తం 62 మంది మృతి


తమ దేశంలో అగ్రరాజ్యం అమెరికా కుట్ర పన్నినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా తల ఒగ్గి ఉంటే తాను ప్రధానమంత్రి పదవిలో కొనసాగేదానినని ప్రకటించారు. స్వదేశానికి తిరిగి వెళ్తానని స్పష్టం చేశారు. మళ్లీ తన పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశంలో జరిగిన సంఘటనలపై తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Also Read: Sheikh Hasina Resign: బంగ్లాదేశ్‌లో సైనిక పాలన? ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా


పదవి నుంచి వైదొలిగిన తర్వాత తొలిసారి ఓ ఆంగ్ల పత్రికతో షేక్‌ హసీనా మాట్లాడారు. 'నేను శవాల ఊరేగింపును చూడాలనుకోలేదు. విద్యార్థుల శవాలపై వారు అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకున్నారు. కానీ నేను దానిని అంగీకరించలేదు. అందుకే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశా' అని వివరించారు. 'ఒకవేళ నేను సెయింట్‌ మార్టిన్‌ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి అమెరికాకు బంగాళాఖాతంలో పట్టు కల్పిస్తే ప్రధానమంత్రి పదవిలో కొనసాగేదానిని' అని అమెరికాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.


'అతివాదుల మాయలో పడొద్దని నా దేశ ప్రజలను కోరుతున్నా' అంటూ షేక్‌ హసీనా విజ్ఞప్తి చేశారు.'హింసాత్మక ఘటనల్లో నాయకులు, కార్యకర్తలు హత్యకు గురవడం చాలా బాధాకరం. దేవుడి దయతో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా' అని ప్రకటించారు. ఆవామీ లీగ్‌ పార్టీ మరోసారి అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేస్తూనే.. బంగ్లాదేశ్‌ క్షేమం కోసం తాను ఎప్పుడూ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి