Coronavirus wave: మరోసారి హడలేత్తిస్తున్న కరోనా.. వారంలో 25, 900 కేసులు.. మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు..
New covid hits singapore: కరోనా మరోసారి తన పంజా విసిరింది. మే 5 నుండి 11 వరకు 25,900 కంటే ఎక్కువ కేసులు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై సింగపూర్ ప్రభుత్వం హైఅలర్ట్ ను ప్రకటించింది. ప్రజలంతా మాస్కులు తప్పనిసరి ధరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
Corona virus effect in singapore: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికించింది. మొదటి వేవ్, ఆ తర్వాత రెండో వేవ్ లో ఎంతో ప్రభావం చూపించింది. కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ప్రపంచ దేశాలన్ని చిగురుటాకుల్లా వణికిపోయాయి. అనేక దేశాలు ఈకోవిడ్ కు కంట్రోల్ చేయలేక, ప్రాణానష్టాలతో పాటు, ఆర్థికంగా కూడా కుదేలైపోయాయి. ఇక కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. క్రమంలో దేశాలు ఇప్పుటిప్పుడు తమ ఆర్థిక వ్యవస్థలను ఒక గాడిలో పెట్టుకుంటున్నాయి. కరోనా కూడా కొత్త కొత్త విధాలుగా రూపాంతరం చెంది తన ప్రభావంను చూపించింది.
Read more:Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?
కానీ కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ ల మాదిరిగా మాత్రం, ఆ తర్వాత బైటపడిన కొత్త వేరియంట్ వల్ల ఎక్కువ మంది తమ ప్రాణాలు కొల్పోవడం జరగలేదు. ఇదిలా ఉండగా.. మరోసాకి కరోనా వ్యాప్తి ప్రారంభమైంది. సింగపూర్ లోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మే 5 నుండి 11 వరకు 25,900 కంటే ఎక్కువగా కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో స్థానిక ప్రభుత్వం హై అలర్ట్ ను ప్రకటించింది.
పూర్తి వివరాలు..
సింగపూర్ దేశం మరోసారి కరోనా మహమ్మారి ప్రభావం ఎదుర్కొంటుంది. గత వారంలో 25,900 కేసులు నమోదయ్యాయి. అధికారులు చెప్పిన దాని ప్రకారం.. మే 5 నుండి 11 వరకు 25,900 కంటే ఎక్కువ కేసులను నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులు వారానికి వారానికి క్రమంగా పెరుగుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రజలు మళ్లీ మాస్క్‌లు ధరించాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.
మే 5 నుండి 11 వారంలో అంచనా వేసిన కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 25,900కి పెరిగింది. అంతకుముందు వారంలో నమోదైన 13,700 కేసులతో పోలిస్తే ఇది 90% పెరిగినట్లు సింగపూర్ ఆరోగ్యశాఖ మంత్రి ఓంగ్ వెల్లడించారు. వచ్చే రెండు వారాల్లో ఇలా నెగ్లీజెన్సీతో ఉంటే.. ఈకేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అధికారులు నిరంతరంగా కరోనా టెస్టులు చేయాలని కోరారు. ప్రజలు ఇళ్లనుంచి బైటకు వెళ్లొద్దని, అత్యవసరంగా వెళ్తే.. మాస్క్ లు, సాటిటైజర్ లు తప్పకుండా ధరించాలని కూడా కోరుతున్నారు.
ఈ కేసులు సంఖ్యను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, ఆరోగ్య అధికారులు పేర్కొంటున్నారు. మరో వైపు.. ఆస్పత్రులలో హాస్పిటల్ బెడ్ సామర్థ్యాన్ని పెంచేందుకు, ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్ లు పెంచేదిశగా చర్యలు తీసుకొవాలని ఆదేశించారు. స్వల్పమైన సింప్టమ్స్ ఉంటే ఇంటి దగ్గరే ఉండి, ట్రీట్మెంట్ చేయించుకొవాలని కరోనా సోకితే, ఇంటి వద్దనే హోమ్ ఐసోలేషన్ ఉండాలంటూ అధికారులు ఆదేశిస్తున్నారు. సీరియస్ గా ఉంటేనే ఆస్పత్రులకు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకొవాలని, స్వల్పంగా సింప్టమ్స్ ఉంటే ఇంట్లోనే హోమ్ క్వారైంటైన్ ఉండాలని సూచించారు.
ముఖ్యంగా.. వృద్ధులు, చిన్న పిల్లలు, వ్యాధులతో బాధలు పడుతున్న వారు అలర్ట్ గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడైతే కరోనా సింగపూర్ లో వ్యాపించి ఉందని, ఇక్కడి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇతరదేశాలకు వెళ్లకుండా , హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా, ప్రధానమైన COVID-19 కి చెందిన కొత్త కొత్త వేరియంట్ లు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికీ JN.1, KP.1, KP.2తో సహా దాని ఉప-వంశాలు. ప్రస్తుతం, KP.1, KP.2 సింగపూర్‌లో మూడింట రెండు వంతుల కేసులను కలిగి ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter