Nuclear War Heads: అణ్వస్త్ర సంపద ఇండియా కంటే ఆ రెండు దేశాల్లోనే ఎక్కువ, సిప్రి 2021 నివేదిక
Nuclear War Heads: ఇండియాకు పాకిస్తాన్, చైనా రెండూ దాయాది దేశాలే. ఈ మూడు దేశాల్లో ఎవరి వద్ద అణ్వస్త్రాలు ఎక్కువగా ఉన్నాయనే విషయంలో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నివేదిక ఏం చెబుతోంది.
Nuclear War Heads: ఇండియాకు పాకిస్తాన్, చైనా రెండూ దాయాది దేశాలే. ఈ మూడు దేశాల్లో ఎవరి వద్ద అణ్వస్త్రాలు ఎక్కువగా ఉన్నాయనే విషయంలో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నివేదిక ఏం చెబుతోంది.
ఇండియా, పాకిస్తాన్, చైనా దేశాల్లో న్యూక్లియర్ వార్ హెడ్స్ అంటే అణ్వస్త్రాలు ఎవరి వద్ద ఎక్కువున్నాయనే విషయం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. సిప్రి (SIPRI) అంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వెలువరించిన నివేదికే ఇందుకు కారణం. ఈ నివేదికలో ఇండియా, చైనా, పాకిస్తాన్ దేశాల్లో ఉన్న అణ్వస్త్రాలు(Nuclear Weapons), ఆయుధాల వివరాలున్నాయి. ఇందులో చైనా ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆశ్చర్యం కల్గించే మరో విషయమేమంటే..ఇండియా కంటే పాకిస్తాన్ ముందంజలో ఉండటం.
2021 జనవరి నాటికి చైనా వద్ద 350 అణ్వస్త్రాలుండగా..పాకిస్తాన్‌లో 165 ఉన్నాయి. ఇటు ఇండియాలో 156 వార్ హెడ్స్ ఉన్నాయి. మూడు దేశాలు తమ అణ్వస్త్రాల సామర్ధ్యాన్ని పెంచుకునే పనిలో ఉన్నాయని వివరించింది. ఇదే గత ఏడాది అయితే చైనా వద్ద 320, పాకిస్తాన్ వద్ద 160, ఇండియా వద్ద 150 న్యూక్లియర్ వార్ హెడ్స్ (Nuclear War Heads) ఉన్నాయి. ప్రపంచంలో ప్రస్తుతం 9 దేశాలకు అణ్వస్త్ర సామర్ధ్యముంది. అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయిల్, ఉత్తర కొరియా వద్ద అణ్వాయుధాలున్నాయి. ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధాల సంఖ్య 13 వేల 80 అయితే..90 శాతం ఆయుధాలు అమెరికా, రష్యాల వద్దే ఉన్నాయి. అణ్వాయుధాల తయారీకి అవసరమైన ముడి పదార్ధాన్ని ఫిస్సైల్ మెటీరియల్ అని పిలుస్తారు. అత్యంత శుద్ధిచేసిన యురేనియం లేదా సెపరేటెడ్ ప్లూటోనియంను మిస్సైల్ మెటీరియల్‌గా ఉపయోగిస్తారు. ఇండియా(India), ఇజ్రాయిల్ దేశాలు ఎక్కువగా ప్లూటోనియం ఉత్పత్తి చేస్తుండగా..పాకిస్తాన్(Pakistan) యూరేనియం ఉత్పత్తి చేస్తూ ప్లూటోనియం ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకునే పనిలో ఉంది. చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యూఎస్ దేశాలు రెండు రకాల మిస్సైల్ మెటీరియల్స్ ఉత్పత్తి చేయగలవు. 2016-20 మధ్యకాలంలో ఆయుధాల దిగుమతిపరంగా చూస్తే..సౌదీ అరేబియా, ఇండియా, ఈజిప్టు, ఆస్ట్రేలియా, చైనాలు టాప్ 5 లో ఉన్నాయి. ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో సౌదీ అరేబియా వాటా 11 శాతమైతే..ఇండియా వాటా 9.5 శాతంగా ఉంది. సిప్రి ఇయర్ బుక్ 2021లో (SIPRI Year Book 2021) ఉన్న ఈ వివరాలిప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇండియా శత్రుదేశాల్లో అణ్వస్త్రాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది.
Also read: Covaxin Vaccine: కోవాగ్జిన్ తీసుకున్నా ఓకే అంటున్న అమెరికా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook