Solar Storm: తస్మాత్ జాగ్రత్త. సౌర తుపాను అతి వేగంతో దూసుకొస్తోంది. జీపీఎస్, మొబైల్ సిగ్నల్స్, శాటిలైట్ టీవీ సేవలకు అంతరాయం కలగనుంది. భయంకర వేగంగా దూసుకొస్తున్న సౌర తుపాను గురించి హెచ్చరికలు జారీ అయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సముద్రంలోనే కాదు అనంత విశ్వపు కేంద్రమైన సౌర వ్యవస్థ(Solar System)లో కూడా తుపాన్లు సంభవిస్తుంటాయి. విశ్వంలో అత్యంత శక్తివంతమైన సౌర తుపాను అతి భయంకర వేగంతో భూమివైపుకు దూసుకొస్తోంది. గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. రానురాను వేగం మరింత పెరుగుతోందని..అమెరికాకు చెందిన స్పేస్ వెదర్ ప్రెడిక్షన్ సెంటర్ తెలిపింది.ఈ సౌర తుపాను కారణంగా ఉత్తర లేదా దక్షిణ ధృవం వద్ద నివసిస్తున్న ప్రజలు ఆకాశంలో అందమైన ఖగోళ కాంతి దృశ్యాన్ని చూడనున్నారు. అతి వేగంతో వస్తున్న ఈ సౌర తుపాను ఇవాళ లేదా రేపు భూమిని తాకనుందని తెలుస్తోంది. spaceweather.com వెబ్‌సైట్ ప్రకారం సూర్యుని వాతావరణం నుంచి ఉద్భవించిన తుపాను సూర్యుడి వైపుున్న భూమి సబ్ పోలార్ పాయింట్‌లో కేంద్రీకృతమై ఉంది. 


సౌర తుపాను కారణంగా ఉపగ్రహ సేవలకు అంతరాయం ఏర్పడనుందని నాసా (NASA) తెలిపింది.స్పేస్ వెదర్(Space Weather)ప్రకారం సౌర తుపానుల కారణంగా భూమి బాహ్య వాతావరణం భారీగా వేడి చెందే అవకాశముంది. జీపీఎస్ నావిగేషన్, శాటిలైట్ టీవీ సేవలు, మొబైల్ ఫోన్ సిగ్నల్‌లకు అంతరాయం ఏర్పడనుంది. అదే విధంగా విద్యుత్ సరఫరా విషయంలో ఆటంకం కలగనుంది. సౌర తుపాను కారణంగా ట్రాన్స్ ఫార్మర్‌లు పేలే అవకాశాలున్నాయి. 


Also read: International flights: మాల్దీవ్స్, జర్మనీ, కెనడాలో ఇండియన్స్‌కి ఎంట్రీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook