South Africa Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 63 మంది సజీవ దహనం
South africa Fire Accident Latest Updates: దక్షిణాఫ్రికాలోని సెంట్రల్ జోహన్నెస్‌బర్గ్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 63 మంది దుర్మరణం చెందారు. మరో 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
South africa Fire Accident Latest Updates: దక్షిణాఫ్రికాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సెంట్రల్ జోహన్నెస్‌బర్గ్‌లోని ఐదు అంతస్తుల భవనంలో గురువారం భారీస్థాయిలో మంటలు చెలరేగాయి. ఈ ఘోర దుర్ఘటనలో 63 మంది ప్రాణాలు కోల్పోగా.. 43 మందికి గాయాలయ్యాయని మున్సిపల్ ప్రభుత్వం వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మంటలు అదుపులోకిరాగా.. పెద్ద ఎత్తున పొగలు కమ్ముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది.
ప్రమాద సమయంలో భవనంలో దాదాపు 200 మంది వరకు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఉంటున్నవారు ఎలాంటి లీజ్ అగ్రిమెంట్లు లేకుండా నివాసం ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. మంటల ధాటికి బిల్డింగ్ చాలా వరకు ధ్వంసమైందని చెప్పారు. మంటలు చాలా వరకు ఆరిపోయాయని అన్నారు. అయితే భవనం డౌన్‌టౌన్ కిటికీల నుంచి పొగలు వెలువడుతున్నాయని.. కొన్ని కిటికీల నుంచి షీట్లు, ఇతర పదార్థాల తీగలు కూడా వేలాడుతున్నాయని తెలిపారు. మంటల నుంచి తప్పించుకోవడానికి ప్రజలు కిటికీల నుంచి దూకుతున్నారని పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికార ప్రతినిధి రాబర్ట్ ములౌద్జీ తెలిపారు.
Also Read: Raksha Bandhan Wishes 2023: రాఖీ శుభాకాంక్షలు ఇలా ప్రత్యేక ఫోటోస్, కోట్స్‌తో తెలియజేయండి..
Also Read: Aditya-L1 Mission Rehearsals: ఆదిత్య L1 ప్రయోగం రాకెట్ చెకింగ్, రిహార్సల్స్ పూర్తి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook