Sri Lanka crisis: శ్రీలంకలో ఆర్థిక, ఇంధన సంక్షోభం రోజు రోజుకు ముదురుతోంది. ఇంధన కొరత వల్ల ప్రజలు వివిధ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలో సరిపడా ఇంధనం లేని కారణంగా ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. బుధవారం (మార్చి 30) నుంచి దేశవ్యాప్తంగా రోజుకు 10 గంటల చొప్పున విద్యుత్ సరఫరా నిలిపివేయాలని (పవర్​ కట్​) భావిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీలంక సంక్షోభానికి కారణాలు..


విదేశీ మారక నిల్వలు సరిపడా లేకపోవడం వల్ల శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇదే సమయంలో దేశంలో నిత్యవసరాల ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చున్నాయి. దీనితో ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.


ఇదిలా ఉండగా.. పెట్రోల్​ బంకుల ఎదుట వాహనాదారులు గంటల తరపడి వేచి ఉండాల్సి వస్తోంది. ఇళ్లలో ఉన్న ప్రజలు కూడా.. గంటల తరబడి కరెంటుకోతల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల ఆరంభంలో కరెంటు కోతలు రోజుకు 7 గంటలుగా ఉంటే.. తాజాగా ఆ సమయాన్ని 10 గంటలకు పెంచింది ప్రభుత్వం. దేశంలో ప్రస్తుతం 750 మెగా వాట్ల విద్యుత్ కొరత ఉందని ప్రభుత్వం తెలిపింది. థర్మల్​ విద్యుత్​ ఉత్పత్తికి అవసరమైన ఇంధనం లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తినట్లు పబ్లిక్ యుటిలిటీ కమిషనర్​ జనక రత్నాయక చెప్పారు.


ఇదిలా ఉండగా.. శ్రీలంక ప్రభుత్వాధీనంలోని సీలోన్ పెట్రోలియం కార్పొరేషన్​ (సీపీసీ) వాహనదారులెవ్వరూ బుధ, గురువారాల్లో పెట్రోల్​ బంకుల వద్ద క్యూలో ఉండొద్దని సూచించింది. సంస్థ కొనుగోలు చేసిన ఇంధానికి చెల్లింపులు ఇంకా పూర్తవలేదని.. అందుకే ఇంధనం సరఫరా చేయలేమని స్పష్టం చేసింది. ఇప్పటికే పోర్టుకు చేరుకున్న ఇంంధనానికి శుక్రవారమే చెల్లింపు జరగొచ్చని తెలిపింది. ఆ తర్వాతే వాహనదారులకు ఇంధంన సరఫరా చేయగలమని వెల్లడించింది.


భారీగా ఇంధనం కొనుగోలు..


ఇక శ్రీలంక ఇంధన మంత్రి గామిని లోకుంగే సంక్షోభంపై స్పందించారు. త్వరలోనే ప్రభుత్వం.. ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​ (ఐఓసీ) సబ్సిడరీ కంపెనీ అయిన.. ఎల్​ఐఓసీ నుంచి 6,000 మెట్రిక్​ టన్నుల డీజిల్​ను కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. ఆ ఇంధనాన్ని ద్వారా అత్యవసర సేవలు, విద్యుత్ ఉత్పత్తికి వినియోగించనున్నట్లు వివరించారు.


ఇక శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు భారత్ రుణ సహాయాన్ని బిలియన్ డాలర్లకు పెంచింది. ఇక ఇటీవల శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. శ్రీ లంక సంక్షోభం నుంచి బయటపడేందుకు అవసరమైన సహాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటుందని హామీ ఇచ్చారు కూడా.


Also read: Shanghai lockdown: చైనాలో కొవిడ్ భయాలు- నిర్బందంలో షాంఘై ప్రజలు!


Also read: Mexico Shootout: మెక్సికోలో కాల్పుల బీభత్సం... 19 మంది మృతి...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook