Sri Lanka Economy Crisis: ద్వీప దేశం శ్రీలంక(Sri Lanka) ఆహార, ఆర్థిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతోంది. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో నిత్యావసరాల ధరలు(Commodity prices) అమాంతం ఆకాశన్నంటాయి. నిత్యావసర ఆహార పదార్థాల(Food items)పై ధరల నియంత్రణను ప్రభుత్వం ఎత్తివేయడమే ఇందుకు కారణం. దీంతో ప్రస్తుతం అక్కడ వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర ఏకంగా 90శాతం పెరిగి ₹657కు చేరింది. ఇక కేజీ పాలపొడి ధర ఐదు రెట్లు పెరిగి ₹1,195గా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం
గత ఏడాది కాలంగా శ్రీలంకను ఆహార, ఆర్థిక సంక్షోభం(Sri Lanka Economy Crisis) కుదిపేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఆ దేశ విదేశీ మారక ద్రవ్యం(Foreign exchange) భారీగా పతనమైంది. మరోవైపు కరోనా మహమ్మారి దెబ్బకు ఎగుమతులు దెబ్బతిన్నాయి. ప్రత్యేకించి పర్యాటకరంగం(Tourism )పై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఉన్న కాసిన్ని విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకునే క్రమంలో దిగుమతులపై నిషేధం విధించింది. 


Also read: India-China Talks: ఆ ప్రాంతాల్నించి చైనా వెనక్కి వెళ్లాల్సిందే


అయితే నిత్యావసర వస్తువులైన పప్పులు, పంచదార, గోధుమపిండి, కూరగాయాలు వంటి వస్తువులకు కూడా శ్రీలంక దిగుమతులపైనే ఆధారపడాలి. ప్రభుత్వ నిషేధంతో ఆ వస్తువుల డిమాండ్, సరఫరా మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లంక ప్రభుత్వం ధరలపై నియంత్రణ విధిస్తూ అత్యవసర నిబంధనలు తీసుకొచ్చింది.


సరఫరా తగ్గింది...ఆహార కొరత ఏర్పడింది..
అయితే ధరలపై నియంత్రణ తీసుకురావడంతో అక్రమ నిల్వలు పెరిగి మార్కెట్లో సరఫరా తగ్గింది. దీంతో ఆహార కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత గురువారం అధ్యక్షుడు గొటబయ రాజపక్స(President Gotabaya Rajapaksa) అధ్యక్షత సమావేశమైన కేబినెట్.. ధరలపై నియంత్రణ ఎత్తివేయాలని నిర్ణయించింది. దీని వల్ల అక్రమ నిల్వలను బయటకు తీసుకురావొచ్చని, తద్వారా సరఫరా పెంచాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే నిత్యావసరాలపై ధరల నియంత్రణను తొలగిస్తున్నట్లు గత శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 


దీంతో ఒక్కసారిగా నిత్యావసర ధరల మోత మోగింది. గత శుక్రవారం ₹1400 ఉన్న 12.5కేజీల వంట గ్యాస్‌ సిలిండర్ ధర.. ఇప్పుడు ₹2,657కు చేరింది. అంటే రెండు రోజుల వ్యవధిలోనే సిలిండర్ ధర రూ.1257 పెరిగింది. ఇక కేజీ పాల పొడి ధర ₹250 నుంచి ₹1195కు చేరింది. ఇవే కాదు.. గోధుమ పిండి, పంచదార, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువులు, సిమెంట్‌ సహా దాదాపు అన్నింటి ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గించాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి