Sri Lanka Emergency: ఇటీవలే శ్రీలంకలో విధించిన ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రకటించారు. దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా గత కొన్నిరోజులుగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 1 నుంచి లంకలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు అధ్యక్షుడు ప్రకటించారు. అయితే అత్యవసర పరిస్థితి కారణంగా దేశంలో ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఎమర్జెన్సీని ఎత్తివేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీలంకలో ఏం జరుగుతోంది?


శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. దీని కారణంగా దేశంలోని ప్రతి నిత్యావసర వస్తువుల ధరలను ఆకాశాన్ని అంటాయి. దీంతో వాటిని కొనేందుకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నిత్యావసర వస్తువులను కొనే స్తోమత లేని వాళ్లు కడుపు మాడ్చుకుంటున్నారు. అలా ప్రభుత్వంపై అసహనంతో ప్రజలంతా రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ఆందోళనకారులు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నివాసాన్ని ముట్టడించారు. దేశవ్యాప్త నిరసనలను అణచివేసేందుకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. 


ఎమర్జెన్సీ అంటే ఏమిటి?


ఎమర్జెన్సీ అంటే.. ఏదైనా దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో దేశం మొత్తం అద్యక్షుడి హ్యాండోవర్ లోకి వస్తుంది. ఈ క్రమంలో ఎవరినైనా నిర్బంధించడం, ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, సోదాలను నిర్వహించే అధికారం దేశ అధ్యక్షుడికి ఉంటుంది.   


Also Read: Srilanka Crisis: శ్రీలంక ఆర్థిక సంక్షోభం ప్రపంచానికి ఏం పాఠం చెబుతోంది...


Also Read: Sri Lanka Crisis: శ్రీలంకలో కేబినెట్‌ మంత్రుల రాజీనామా..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook