Sri Lanka Crisis:  శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజు రోజుకు తీవ్ర స్థాయికి చేరుతుంది. ఈ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో  శ్రీలంకలో కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రీలంకలోని అధికారంలో ఉన్న 26 మంది కేబినెట్ మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. అయితే రాజీనామా పత్రాలను  శ్రీలంక ప్రధానికి అందజేశారు. అదివారం అర్ధరాత్రి జరిగిన అధికారుల సమావేశంలో మూకుమ్మడిగా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. తక్షణమే రాజీనామాల నిర్ణయం  అమల్లోకి వస్తుందని శ్రీలంక ప్రధానికి వారికి తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీలంకలో ప్రస్తుతం అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సోదరుడు మహిందా రాజపక్స ప్రధానిగా కొనసాగనున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. అయితే ఇటీవల పెరిగిన ధరలు, నిత్యవసరాల కొరత, విద్యుత్‌ కోతలతో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో అధ్యక్ష స్థానం నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేస్తూ అధ్యక్ష భవనాన్ని ప్రజలు చుట్టుముట్టారు. దీంతో అక్కడ తీవ్ర హింస చెలరేగింది.ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దీంతో అధ్యక్షుడు ఎమర్జెన్సీ విధించిన సంగతి అందరికి తెలిసిందే. 


Also Read: Neha Shetty Saree Pics: ఫెస్టివల్ మూడ్‌లో నేహా శెట్టి.. ఆహా అనిపిస్తున్న 'డీజే టిల్లు' హీరోయిన్ అందం!


Also Read: Mouni Roy Photos: పెళ్లి తర్వాత మరింత సన్నబడిన 'నాగిని' మౌనీరాయ్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook