Srilanka President to Remove PM Mahinda : శ్రీలంకలో ప్రధాని మంతి మహిందా రాజపక్సేకు పదవీ గండం తప్పేలా లేదా ? పీఎం కుర్చీ లోంచి మహిందా రాజపక్సే తొలగింపునకు రంగం సిద్ధమైందా ? శ్రీలంక అధ్యక్షుడు తీసుకోబోయే తదుపరి చర్యలేంటి ? అక్కడి తాజా పరిణామాలు ఏం చెబుతున్నాయి ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 దేశ చరిత్రలోనే అతి ఘోర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని శ్రీలంక విలవిలలాడుతోంది. నిత్యవసరాలు ఆకాశాన్నంటాయి. కొనడానికి డబ్బులు లేవు.. అసలు కొనుగోలు చేసేందుకు అందుబాటు నిత్యవసరాలు కూడా లేని పరిస్థితి. పెట్రోల్ కాదు దాని ధర చెబితేనే మంటలు పుడుతున్నాయి. లీటర్ పెట్రోల్ 500 రూపాయలకు చేరిందంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వందల రూపాయలు ఇస్తే కానీ కిలో బియ్యం రావడం లేదు. దీంతో ప్రజాగ్రహం పెల్లుబుకింది.


ప్రధాని మహీందా రాజపక్సే కుటుంబానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. ప్రధాని, అధ్యక్ష పదవులతో పాటు కేబినెట్‌లో మరో ఇద్దరు రాజపక్సే కుటుంబీకులే ఉన్నారు. దాంతో వారు గద్దె దిగాలంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొన్న చోట్ల నిరసనలు హింసాత్మకమయ్యాయి. పరిస్థితి రోజురోజుకు చేయజారిపోతోంది. జనాన్ని శాంతింప చేసేందుకు ప్రధాని మహిందా రాజపక్సే చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించడం లేదు.


జనాగ్రహం కట్టలు తెంచుకుంటుండటంతో  ఇక మహిందా రాజపక్సే తొలగింపు తప్ప మరో మార్గం కనిపించడం లేదు. దాంతో తన అన్నయ్య, దేశ ప్రధాని మహిందా రాజపక్సేను తొలగించేందుకు శ్రీలంక అధ్యక్షుడు గొలాబయ రాజపక్సే అంగీకరించారు. దేశంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి తెరదించేందుకు మధ్యంతర  ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి గొటబయ సమ్మతించారు. ఇందుకోసం నేషనల్ కౌన్సిల్ ను అధ్యక్షుడు ఏర్పాటు చేయనున్నారు. ఆ కౌన్సిలే కొత్త ప్రధాని మంత్రిని ఎంపిక చేయనుంది.


 చైనా నుంచి భారీగా అప్పలు చేసిన శ్రీలంక దివాళా తీసే పరిస్థితికి చేరింది. ఈ ఏడాది దాదాపు 7 బిలియన్ డాలర్ల రుణాలు చెల్లించాలి. 2026కి 25 బిలయన్ డాలర్లకు శ్రీలంక అప్పు చేరుతుంది. ఒక పక్క రుణభారం విపరీతంగా పెరగడం, మరోపక్క కరోనా కట్టడికి లాక్ డౌన్లు విధించడంతో పరిస్థితి చేయిజాయింది. దేశంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగింది. ఇంధన కొరత, విదేశీ మారక నిల్వలు అడుగంటడం ఇవన్నీ సిలోన్ కొంప ముంచాయి. అయితే రాజీనామా  చేసేందుకు ససేమిరా అంటున్న మహిందాను పదవి నుంచి దించేందుకు అధ్యక్షుడు గొటబయ అంగీకరించడం కీలకంగా మారింది.


Also Read: Bjp Slogans at Minster Prasanth Reddy: మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎదుట జైశ్రీరాం నినాదాలు


Also Read: Ktr Hot Comments: తెలుగు రాష్ట్రాల మధ్య రచ్చ.. కేటీఆర్ కు బొత్స కౌంటర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook