మరణించిన వారితోనూ చాటింగ్ చేయవచ్చట
చనిపోయిన వారితోనూ చాటింగ్ చేయవచ్చని స్వీడన్ కంపెనీ ఫెనిక్స్ వాటింగ్ వెల్లడించింది.
చనిపోయిన వారితోనూ చాటింగ్ చేయవచ్చని స్వీడన్ కంపెనీ ఫెనిక్స్ వాటింగ్ వెల్లడించింది. నమ్మలేకపోయినా ఇది నిజమండీ బాబోయ్..! మీకిష్టమైన వారు మీకు దూరం అయినప్పుడు వారితో మాట్లాడిస్తామంది. కృత్రిమ మేధస్సుతో ఇదంతా సాధ్యమని అంటోది అంత్యక్రియలు నిర్వహించే ఫెనిక్స్ వాంటింగ్ అనే కంపెనీ.
దీనికోసం ‘బోట్స్’ అనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌ను రూపొందిస్తున్నామంది. ఈ టెక్నాలజీ సాయంతో చనిపోయినవారు తమ బంధువులతో చాటింగ్ చేసినట్లు ప్రోగ్రామింగ్ చేస్తామని, దీంతో ఎదుటివారికి నిజంగా చనిపోయిన వారితో చాటింగ్ చేస్తున్న అనుభూతి వస్తుందన్నారు. ఇదంతా ఓ ఊహలా ఉన్నా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో ఇదంతా సాధ్యం చేయగలమని చెబుతున్నారు. ఇప్పటికే రష్యాలో ఓ ప్రోగ్రామర్ ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ను విజయవంతంగా ప్రయోగించాడట. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి చెందిన ఆ ప్రోగ్రామర్ కారు ప్రమాదంలో చనిపోయిన స్నేహితుడితో చాటింగ్ కూడా చేశారట.