Taliban meets ex Afghan President Hamid Karzai: తాలిబన్ల కమాండర్, హక్కానీ నెట్‌వర్క్ టెర్రరిస్ట్ గ్రూప్ అగ్ర నేత అనస్ హక్కానీ అఫ్గనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయితో భేటీ అయ్యారు. అఫ్గనిస్థాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు అంశంపై చర్చించేందుకు అనస్ హక్కానీ (Anas Haqqani) అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయితో సమావేశమయ్యారని తాలిబన్ల ప్రతినిధి ఒకరు వెల్లడించినట్టుగా ఎన్డీటీవీ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ సమావేశంలో కర్జాయితో పాటు మాజీ ప్రభుత్వం శాంతి దూత అబ్ధుల్లా అబ్ధుల్లా కూడా పాల్గొన్నారని.. అంతకు మించి సదరు శాంతి దూత మరే ఇతర వివరాలు వెల్లడించలేదని ఎన్డీటీవీ కథనం పేర్కొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాలిబన్లు (Talibans) తీసుకునే నిర్ణయాలలో, ఇతర వ్యవహారాలలో హక్కాని నెట్‌వర్క్ టెర్రరిస్టు గ్రూప్ కీలక పాత్ర పోషిస్తుంటుంది. ఆదివారం నాడు తాలిబన్లు అఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌ని ఆక్రమించడంలోనూ ఈ హక్కాని నెట్‌వర్క్ గ్రూప్ టెర్రరిస్టులే (Haqqani Network terrorist group) కీలక పాత్ర పోషించారు.


Also read : Talibans Press Meet: మహిళలకు, విదేశీయులకు పూర్తి రక్షణ 


అఫ్గనిస్థాన్‌లో పాకిస్తాన్ సరిహద్దుల్లో హక్కాని నెట్‌వర్క్ గ్రూప్‌కి మంచి పట్టు ఉంది. ఇటీవల అఫ్గనిస్థాన్‌లో (Blasts in Afghanistan) జరిగిన అనేక పేలుళ్ల వెనుక హక్కాని నెట్‌వర్క్ టెర్రరిస్టు గ్రూప్ ప్రమేయం ఉందనేది ఆ ఉగ్రవాద సంస్థపై ఉన్న ప్రధాన ఆరోపణ. అఫ్గనిస్తాన్‌లో (Afghanistan) తాలిబన్లలో యాక్టివ్‌గా ఉన్న ఉగ్రవాద సంస్థ కూడా వీళ్లదే కావడం గమనార్హం.


Also read : Afghanistan: ఇండియాకు క్షేమంగా చేరిన ఆఫ్ఘన్‌లోని దౌత్యసిబ్బంది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook