Kabul Bomb Blast Issue: ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లకు..అమెరికన్లకు వైరం పెరుగుతోంది. కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద జరిగిన బాంబు పేలుళ్ల ఘటనకు ప్రతీకారంగా అమెరికా జరిపిన ద్రోన్ దాడుల్ని తాలిబన్లు ఖండించారు. ఏకపక్ష నిర్ణయాలంటూ మండిపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)కాబూల్ విమానాశ్రయం వద్ద జరిగిన బాంబు పేలుళ్ల ఘటన తాలిబన్లకు అమెరికా సైన్యానికి మధ్య వైరాన్ని పెంచుతోంది. కాబూల్ బాంబు పేలుళ్ల ఘటనకు ప్రతీకారంగా అమెరికా ఐసిస్ కే కదలికల్ని గుర్తించి వైమానిక దాడులు నిర్వహించింది. అయితే ఈ దాడుల్ని ఖండిస్తున్నట్టు తాలిబన్ అధికార ప్రతినిధి జబీహూల్లా ముజాహిద్ తెలిపారు. విదేశీ గడ్డపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని హితవు పలికారు. 


కాబూల్ ఎయిర్‌పోర్ట్(Kabul Airport)సమీపంలో ఆత్మాహుతి దాడి ఘటనలో వందమందికి పైగా సాధారణ పౌరులు, 13 మంది అమెరికన్ సైనికులు మరణించారు. ఐసిస్(ISIS) ఖోరసాన్ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడినట్టు తేలింది. ఈ దాడులకు ప్రతీకారంగా అమెరికా ద్రోన్ వైమానిక దాడులతో(America Drone strikes) సమాధానం చెప్పింది. తాజాగా నిన్న కూడా మరోసారి అమెరికా సైనికులు లక్ష్యంగా జరిగిన రాకెట్ దాడుల్ని అమెరికా తిప్పికొట్టింది. అయితే ఈ దాడుల్ని తాలిబన్లు(Talibans)ఖండించారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని చెప్పారు. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రమాదం పొంచి ఉందని భావిస్తే తమకు సమాచారం చేరవేయాలని..ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల ప్రాణనష్టం జరిగిందని తాలిబన్లు పేర్కొన్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా అమెరికా చేసిన దాడుల వల్ల ఏడుగురు పౌరులు మరణించారని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ స్పష్టం చేశారు. మరోవైపు సూసైడ్ కారు బాంబర్‌ను పేల్చివేసే క్రమంలో పెద్ద పేలుడు సంభవించిందని..కలిగిన నష్టాన్ని అంచనా వేయడమే కాకుండా దర్యాప్తు చేస్తున్నట్టు అమెరికా ధృవీకరించింది. తమ దేశంలో ఉన్నప్పుడు తమను సంప్రదించాలని తాలిబన్లు సూచిస్తున్నారు. 


Also read: Talibans on India: ఇండియాతో వాణిజ్య, రాజకీయ సంబంధాలు కావాలి : తాలిబన్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook