Tamil Nadu to aid Srilanka: శ్రీలంకకు సాయం చేసేందుకు తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే ఇందుకు కేంద్రం నుంచి అనుమతి రాలేదంటోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. నిత్యవసరాలు, కనీస ఔషధాలు కూడా అక్కడి ప్రజలకు అందడం లేదు. ఆకాశాన్ని అంటుతున్న ధరలతో అల్లాడిపోతున్నారు. దేశ చరిత్ర లో ఎప్పుడూ చూడని ద్రవ్యోల్బణం సిలోన్ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అక్కడ ప్రభుత్వ స్వయంకృతాపరాధాలు శ్రీలంక కొంప ముంచాయి. చైనాను నమ్ముకుని నట్టేట మునిగిన శ్రీలంక ప్రభుత్వం ఈ గండం నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇక తమను ఆదుకునే ఆపన్న హస్తం కోసం సిలోన్ వాసులు ఎదురు చూస్తున్నారు. శ్రీలంకలో విదేశీ మారక నిల్వలు అడుగంటాయి. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేని పరిస్థితి. కనీసం వడ్డీలు చెల్లించేందుకు కూడా డబ్బులు లేవు. దీంతో దేశంలో దిగుమతులు నిలిచిపోయాయి. కనీసం పేపర్ తెప్పించుకోలేక అక్కడ పరీక్షలు వాయిదా వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తమను ఆదుకోవాలంటూ శ్రీలంక వాసులు దీనంగా ఎదురు చూస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీలంక వాసులకు సాయం చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం కేంద్రం అనుమతి కోరుతోంది. శ్రీలంకకు తమిళనాడు సాయం చేసేందుకు కేంద్రం అనుమతివ్వాలంటూ అసెంబ్లీలో స్టాలిన్ ప్రభుత్వం ఓ తీర్మానాన్ని చేసింది. తాము ఇప్పటికే కేంద్రం అనుమతి కోరామనీ అది ఇంకా తమకు స్పందన రాలేదన్నారు. శ్రీలంకలో ఏ ప్రభుత్వం ఉన్నా.. మానవతా సాయం కోసం తాము ప్రాణాలు నిలిపే ఔషధాలు, ఆహారపదార్థాలు, నిత్యవసరాలను అందిస్తామని సీఎం స్టాలిన్ అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు.


శ్రీలంకలోని జాఫ్నాలో తమిళులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అంతరయుద్ధంతో దశాబ్దాల పాటు నలిగిపోయిన వారిపై తాజా సంక్షోభం తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అక్కడి వారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉందనీ వారు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నట్లు స్టాలిన్ గుర్తు చేశారు. జాఫ్నాలో ఒకప్పుడు 1200 రూపాయలకు అమ్మిన పురుగుల మందు ధర ఇప్పుడు 32 వేల రూపాయలకు విక్రయిస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


ఇక పెట్రోల్, డిజిల్ కోసం శ్రీలంకలో జనం బారులు తీరుతున్నారు. లీటర్ పెట్రోల్ ధర 500 రూపాయలకు చేరింది. ప్రజా రవాణా స్పందించిపోయింది. అక్కడ కరెంట్ కోతలతో ఇబ్బందిపడుతున్నారు. వాస్తవానికి తమిళనాడు ప్రభుత్వం నేరుగా శ్రీలంకకు సాయం చేసే అవకాశం లేదు. చట్టాలు ఇందుకు అనుమతించవు. కేంద్రం అనుమతితో శ్రీలంక లోని ఇండియన్ ఎంబసీ ద్వారానే తమ సాయం అందించాల్సి ఉంటుంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుమతిస్తే...అనుమతిస్తే అత్యవసర ఔషధాలు, నిత్యవసరాలు పంపాలని స్టాలిన్ ప్రభుత్వం భావిస్తోంది. మార్చి 31న ప్రధాని మోదీతో సమావేశమైనప్పుడు ఇదే అంశాన్ని ప్రస్తావించానని సీఎం స్టాలిన్ గుర్తు చేశారు.


Also read: Roja Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మెగాస్టార్ చిరంజీవిలతో రోజా భేటీ, కారణమేంటి


Also Read: Today Horoscope: ఇవాళ ఏప్రిల్ 30 సూర్యగ్రహణం..శని అమావాస్య, ఆ రాశులవారి పరిస్థితి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook