Tana Fighting: అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు తమ్ముళ్లు తెలుగు ప్రజల, భారతీయలు పరువు గంగలో కలిపేశారు. అమెరికా పెన్సిల్వేనియాలో జరిగిన తానా తెలుగు మహాసభల్లో రెండువర్గాలుగా చీలిన టీడీపీ ఎన్నారైలు వీధి రౌడీల్లా కొట్టుకున్నారు. ఉత్తర అమెరికా తెలుగు మహాసభల పరువు తీసేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికాలో తానా సభలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. పెన్సిల్వేనియాలో జరుగుతున్న 23వ తెలుగు మహాసభలు నిన్న శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి తానా మహాసభలంటే తెలుగుదేశం సభలనే అనవచ్చు. ఎందుకంటే అధికశాతం హాజరయ్యేది తెలుగు తమ్ముళ్లే. అదే సమయంలో పార్టీకు సంబంధించిన వ్యవహారాల్లో పరుచూరి, వేమన సతీష్ వర్షాలు వాదనకు దిగాయి. అంతలోనే ఒకరికొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ తన్నుకున్నారు. చొక్కాలు పట్టుకుని చించుకున్నారు. 


ఈ వివాదానికి కారణం లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రావడమే. తెలుగుదేశం పార్టీ దిగజారిపోవడానికి కారణం చంద్రబాబు, లోకేష్ అని, 2024 ఎన్నికల్లో సైతం మరోసారి పరాభవం తప్పదని కొందరు అభిప్రాయపడ్డారు. పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతిలో ఉంటే బాగుపడే అవకాశం లేదనే మాట అక్కడ విన్పించింది. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే తప్ప పార్టీ బాగుపడదని బాహాటంగానే కొందరు వాదించుకున్నారు. దీంతో వేమన సతీష్ వర్గం వాదనకు దిగింది. ఒకరికొకరు మాటలు విసురుకునే స్థాయి దాటి చేయి చేసుకునే స్థితికి చేరుకున్నారు. చేతికి అందినవాటితో కొట్టుకున్నారు.


గతంలో కూడా టెక్సాస్‌లో ఓ సారి బాలకృష్ణ వర్సెస్ పవన్ కళ్యాణ్ అభిమానులు బాహాటంగా తన్నుకున్నారు. ఆ ఘటన అక్కడి ఎన్నారైలు ఇంకా మర్చిపోలేదు. పేరుకు తానా సభలే గానీ అంతా టీడీపీ వర్గాలదే ఆధిపత్యం. ఇప్పుడక్కడి తెలుగువారు కులాల పేరుతో, సినీ నటుల పేరుుతో, ప్రాంతాల వారీగా విడిపోయి సమావేశాలు పెట్టుకుంటున్నారు. 


Also read: Pawan Kalyan: పొత్తులపై పవన్ కళ్యాణ్‌ యూటర్న్..? తాజా వ్యాఖ్యలతో కొత్త ట్విస్ట్..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook