'కరోనా వైరస్' కేసులు పెరుగుతున్న ఇటలీలో తెలంగాణ విద్యార్థులు చిక్కుకున్నారు. రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు..  తమను స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటున్నారు.  ఇప్పటికే రోమ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఆహారం, నీరు లేక పడిగాపులు పడుతున్నారు. దాదాపు 40 గంటలపాటు అక్కడే వేచి ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Read Also: ధర్మశాల వన్డేకు వర్షం అడ్డంకి..


రోమ్ ఎయిర్ పోర్ట్ అధికారులు, సిబ్బంది తమను విమానం ఎక్కేందుకు అనుమతి ఇవ్వడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. కరోనా నెగెటివ్ సర్టిఫికేట్ ఉంటేనే అనుమతించాలన్ని భారత నిబంధన తమకు అడ్డుగా ఉందని వారు చెబుతున్నారు. దీనిపై భారత ప్రధాని కార్యాలయం, భారత విదేశాంగ శాఖ, తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతున్నారు. భారత దేశానికి వచ్చిన తర్వాత ఎలాంటి వైద్య పరీక్షలకైనా సిద్ధమని చెబుతున్నారు..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. Read Also: సీఎం కుర్చీపై రజినీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు