Tennessee School Shootings Death Toll: అమెరికాలోని నాష్‌విల్లేలో కాల్పుల మోతమోగింది. చిన్నపిల్లలు చదువుకుంటున్న స్కూల్లోకి చొరబడిన ఆగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మొత్తం ఆరుగురు చనిపోగా.. ఇంకొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఇక్కడ ప్రీ-స్కూల్ స్థాయి నుంచి 6వ తరగతి వరకు చదువుకునే పిల్లలు మాత్రమే ఉన్నారు. వీరంతా మూడ్నాలుగేళ్ల నుంచి 12 ఏళ్లలోపు పిల్లలే కావడంతో కాల్పుల మోతకు చిన్నారులు హడలిపోయారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిబిసి ప్రచురించిన కథనం ప్రకారం నాష్‌విల్లెలో ఓ ప్రైవేట్ క్రిస్టియన్ సంస్థ నిర్వహిస్తోన్న స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ 200 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హటాహుటిన స్కూల్‌కి చేరుకుని ఆగంతకుడిని కాల్చిచంపారు. బడిలో కాల్పులు జరిగిన ఘటనలో ఆరుగురు చనిపోయారని తెలుసుకున్న చిన్నారుల కుటుంబాలు, ఆ బడిలో పని చేసే సిబ్బందికి సంబంధించిన కుటుంబాలు తీవ్ర భయాందోళనరు గురయ్యాయి. 


పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆగంతకుడు హతమవడంతో అతడి అరాచకం అంతటితో ఆగిందని.. లేదంటే ఆ దుర్మార్గుడు ఇంకెంత మందిని పొట్టనపెట్టుకునే వాడో అనే భయాందోళన చిన్నారుల తల్లిదండ్రుల్లో స్పష్టంగా కనిపించింది. అయితే విచక్షణరహితంగా కాల్పులకు పాల్పడి ఇంతటి దుర్మార్గానికి తెగబడిన ఆ ఆగంతకుడి అసలు లక్ష్యం ఏంటి ? ఎందుకు ఇలా కాల్పులు జరిపి ఆరుగురుని పొట్టనపెట్టుకున్నాడు ? ఈ స్కూల్‌నే లక్ష్యంగా ఎంచుకోవడానికి ఏమైనా ప్రతీకారం లాంటి కోణాలు ఉన్నాయా ? అసలు ఈ కాల్పులకు పాల్పడిన ఆగంతకుడు ఎవరు ? ఈ స్కూల్‌తో అతడికి ఉన్న సంబంధం ఏంటి అనే కోణంలో అమెరికా పోలీసులు ఆరా తీస్తున్నారు. 


ఇది కూడా చదవండి : US Tornado: అమెరికాలో టోర్నడో బీభత్సం.. 25 మంది మృతి, పలువురు గల్లంతు..


ఇది కూడా చదవండి : Iran Earthquake: ఇరాన్‌ని షేక్ చేసిన భూకంపం.. 165 మందికి గాయాలు


ఇది కూడా చదవండి : Earthquake in North India: ఆఫ్ఘాన్ లో భారీ భూకంపం.. వణికిన ఉత్తర భారతం.. 9 మంది మృతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK