US Shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు... మిస్సిస్సిప్పీలో ఆరుగురు మృతి..

US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఓ దుండగుడు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2023, 10:30 AM IST
US Shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు... మిస్సిస్సిప్పీలో ఆరుగురు మృతి..

US Firing 2023: గత కొన్ని రోజులుగా అగ్రరాజ్యం అమెరికా కాల్పుల మోతతో దద్దరిల్లుతుంది. తాజాగా మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మిస్సిస్సిప్పీలోని టేట్‌ కౌంటీలో ఓ దుండుగడు తుపాకీతో రెచ్చిపోయాడు. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. పలువురు గాయపడ్డారు. 

టేట్‌ కౌంటీలోని అర్కబుట్ల రోడ్డులో ఉన్న ఓ దుకాణంలోకి చొరబడిన అగంతకుడు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ఇద్దరు మృతి చెందారు. అక్కడి నుంచి దగ్గరలో ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లిన దుండగుడు మరో ఇద్దరిని కాల్చి చంపాడు. తర్వాత అర్కబుట్ల డ్యామ్ వద్ద మరో ఇద్దరిపై కాల్పులకు తెగబడ్డాడు. వారు కూడా ప్రాణాలు కోల్పోయారు. సాయుధుడు వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన కాల్పుల్లో మెుత్తం ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 

వరుస ఘటనలు..
ఈనెల 14, 16 తేదీల్లో ఇలాంటి ఘటనలే  చోటుచేసుకున్నాయి. రెండు రోజుల కిందట  టెక్సాస్‌లోని  ఓ షాపింగ్ మాల్ లో ఓ ఉన్నాది కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో వ్యక్తి మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 14న ఓ దుండగుడు మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలో ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు ప్రాణాలు వదిలారు. మరికొందరు గాయపడ్డారు. 

Also Read: Karachi Terrorist Attack: పోలీసు కార్యాలయంపై తాలిబన్ల దాడి.. కరాచీలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News