Corona Vac: చైనా అందిస్తున్న వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా
కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాలు అహర్నిశలూ శ్రమిస్తుండగా..చైనా వ్యాక్సిన్ పంపిణీ కూడా ప్రారంభమైపోయింది. ఇంతకీ ఈ వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా..
కరోనా వైరస్ ( Coronavirus ) కు వ్యాక్సిన్ ( Vaccine ) కోసం ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాలు అహర్నిశలూ శ్రమిస్తుండగా..చైనా వ్యాక్సిన్ ( China Vaccine ) పంపిణీ కూడా ప్రారంభమైపోయింది. ఇంతకీ ఈ వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా..
చైనా ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ ( Covid19 vaccine ) ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. అటు రష్యా ( Russia ) ఇటు చైనా ( China ) వ్యాక్సిన్ సమర్ధత విషయంలో రేగుతున్నసందేహాల్ని తీర్చకుండానే పంపిణీ ప్రారంభించేశాయి. సినోవాక్ బయోటెక్ ( Sinovac Biotech ) అభివృద్ధి చేసిన కోవిడ్ 19 వ్యాక్సిన్ ను చైనా ముందుగా ఫ్రంట్‌లైన్ వారియర్లు, కొవిడ్ ముప్పు అధికంగా ఉన్న సమూహాలకు అందిస్తోంది. అయితే జాతీయ కార్యక్రమంలో భాగంగా అందిస్తున్న ఈ కోవిడ్ 19 వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా.. చైనా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించకపోయినా..రెండు డోసుల వ్యాక్సిన్ ను 60 డాలర్లకు ( 2 Doses of China's corona vac price is 60 Dollars ) అందిస్తుందని తెలిసింది.
ఈ విషయాన్ని జియాక్సింగ్‌లోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ( సీడీసీ ) ( CDC ) ప్రకటించింది. కరోనావాక్ ( Coronavac ) అని పిలిచే ఈ టీకాను రెండు మోతాదుల్లో ఇస్తున్నట్లు తెలిపింది. ఒక్కో డోస్‌కు 2 వందల యువాన్లు అంటే 29.75 డాలర్లు అని వెల్లడించింది. వైద్యనిపుణులు, కోవిడ్ ముప్పు ఎక్కువగా ఉన్నవారికి ముందుగా వ్యాక్సిన్ అందిస్తున్నట్టు సీడీసీ స్పష్టం చేసింది.
జూలై నెలలో ప్రారంభించిన అత్యవసర టీకాల కార్యక్రమంలో భాగంగా లక్షలాది మందికి చివరి దశ ట్రయల్స్‌లో ప్రయోగాత్మక టీకాలు ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఇస్తున్న వ్యాక్సిన్ ధరలో సబ్సిడీ ఉందా లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు. కరోనా వైరస్ ప్రారంభమైనప్పటి నుంచీ అన్ని విషయాల్ని గోప్యంగా ఉంచుతున్న చైనా ఈ విషయాన్ని సైతం రహస్యంగా ఉంచుతోంది. Also read: TikTok App: చైనా ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్, టిక్‌టాక్‌పై నిషేధం తొలగింపు