ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పదార్ధాలలో కొబ్బరి ఒకటి.  హిందువులకు ఒక ముఖ్యమైన పూజా ద్రవ్యం. కొబ్బరికాయను టెంకాయ అని కూడా పిలుస్తాం. వేసవి వచ్చిందంటే కొబ్బరి బొండం రుచి చూడకుండా ఉండలేము. పలు రకాల వంటలు, ఆహార పదార్థాలలో విరివిగా కొబ్బరిని వినియోగిస్తుంటాం. నేడు (సెప్టెంబర్ 2న) వరల్డ్ కోకోనట్ డే (World Coconut Day). Health Tips: కరోనా సమయంలో ఒత్తిడిని జయించాలి.. ఎందుకంటే!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి ఏడాది సెప్టెంబర్ 2న కోకోనట్ దినోత్సవాన్ని ప్రపంచంలో పలు దేశాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. కొబ్బరి, కొబ్బరి నీటిలో (కొబ్బరి బొండంలో) ఉండే సుగుణాలను తెలియజేప్పి దీని ప్రయోజనాలపై అవగాహనా పెంచేందుకు ప్రతి ఏడాది కోకోనట్ డే నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది థీమ్ ఏంటంటే ‘కొబ్బరి మీద పెట్టుబడితో ప్రపంచాన్ని కాపాడండి’ (Invest in Coconut to save the world) అని అంతర్జాతీయ కోకోనట్ కమ్యూనిటీ దీన్ని నిర్ణయించింది. 2019 కోకోనడ్ డే థీమ్ ‘Coconut for Welness’. 2009లో తొలిసారి కోకోనట్ డే నిర్వహించారు. యూఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ ద పసిఫిక్ సంస్థతో కలిసి ఏషియన్ అండ్ పసిఫిక్ కోకోనట్ కల్చర్ (APCC) కోకోనట్ దినోత్సవానికి శ్రీకారం చుట్టింది. Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!


 కొబ్బరి శాస్త్రీయ నామం 'కోకాస్ న్యూసిఫెరా' (Cocos nucifera). కొబ్బరి నీళ్లలో పొటాషియం, భాస్వరం, ఇనుము, సోడియం, కాల్షియం,  రాగి తదితర ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలతో పాటు అతిసార వ్యాధి సమస్యకు చెక్ పెడుతుంది.ఎన్నో ఔషద గుణాలున్న కొబ్బరిపై అవగాహనను పెంచే World Coconut Day 2020లో మీరు భాగస్వాములై ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. Diabetes Prevention: షుగర్ పేషెంట్స్ అలా నడిస్తేనే ప్రయోజనం 
Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి 
Weight Loss Tips: బొజ్జ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి