Three Indians Gujarati  womes Die In Road Accident: అమెరికాలోని సౌత్ కరోలీనా ప్రాంతంలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ యూవీ వాహానం వేగంగా వచ్చి అదుపుతప్పి, ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు చనిపోయినట్లు తెలుస్తోంది. అమెరికాలోని పోలీసుల ప్రకారం.. కారు స్పీడ్ గా వచ్చి, కనీనం 20 అడుగుల ఎత్తులో ఎగిరినట్లు తెలుస్తోంది. సౌత్ కరోలినాలోని గ్రీన్‌విల్లే కౌంటీలోని ఒక బ్రిడ్జి పైకి  ఎస్ యూవీ వాహానం  దూసుకెళ్లడంతో  ముగ్గురు మహిళలు సంఘటన స్థలంలోనే మరణించినట్లు సమాచారం. చనిపోయిన వారంతా గుజరాత్ కు చెందిన వారని తెలుస్తోంది. రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్,  మనీషాబెన్ పటేల్ లుగా అధికారులు గుర్తించారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Pune man Quits Job: ఇలాంటి టాక్సిక్ మనుషుల మధ్య పనిచేయలేను.. వైరల్ గా మారిన పూణే యువకుడి లాస్ట్ వర్కింగ్ డే సెలబ్రేషన్స్..


 
గ్రీన్‌విల్లే కౌంటీ కరోనర్స్ ఆఫీస్ నుండి వచ్చిన నివేదికల ప్రకారం..  I-85లో ఉత్తరం వైపు ప్రయాణిస్తున్న SUV వాహానం స్పీడుగా వచ్చి, బ్రిడ్జీ వైపుకు వెళ్లింది. వంతెనకు ఎదురుగా ఉన్న చెట్లను ఢీకొనే ముందు కనీసం 20 అడుగుల గాలిలోకి దూసుకెళ్లిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలలో రికార్డు అయ్యింది. కారు చెట్టుపై ఇరుక్కుపోయి, పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. కారు అధిక స్పీడ్ తో.. 4-6 లేన్ల ట్రాఫిక్‌ను దూకడం,  సుమారు 20 అడుగుల చెట్లలో దిగడం చాలా అరుదుగా జరిగే  ఘటన అంటూ అధికారులు వెల్లడించారు. కారు అత్యంత వేగంగా ఉండటం వల్ల కంట్రోల్ తప్పిపోయి, ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచన వేస్తున్నారు. సౌత్ కరోలినా హైవే పెట్రోల్, గాంట్ ఫైర్ అండ్ రెస్క్యూ,  బహుళ గ్రీన్‌విల్లే కౌంటీ EMS యూనిట్‌లతో సహా అత్యవసర ప్రతిస్పందన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.


Read More: Spiderman Costume: స్పైడర్మ్యాన్ కాస్టూమ్స్ లో బైక్ మీద రొమాన్స్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు.. వీడియో వైరల్..


ఇదిలా ఉండగా.. ప్రమాదంలో ఒక వ్యక్తి  ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వెంటనే అధికారులు చనిపోయినవారి వివరాలు, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రోడ్డుప్రమాదం జరగడానికి గల కారణాలపై ఆరాతీస్తున్నారు. అధిక స్పీడ్ తో వాహనాలు రోడ్డు ప్రమాదం జరిగిందా.. లేదా మరేదైన కారణం ఉందా.. అన్న కోణంలో  అమెరికా పోలీసులు విచారణ చేపట్టారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter