Rafale Fighter Jets To Reach India Today: భారత్ అమ్ములపొదిలోకి మరో మరో మూడు రాఫెల్‌ యుద్ధ విమానాలు వచ్చి చేరనున్నాయి. భారతదేశం రోజురోజుకూ ఆయుధ సంపత్తిలో పటిష్టంగా మారుతుంది. నేటి(బుధవారం) రాత్రి వరకు మూడు రాఫెల్‌ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్‌లో గమ్యస్థానానికి చేరుకోనున్నాయి. లడాఖ్ సరిహద్దులో భారత్ తమ రాఫెల్ యుద్ధ విమానాలతో పలుమార్లు విన్యాసాలు చేసి తమ సత్తా చాటింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్గం మధ్యలో గాల్లోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో ఇంధనాన్ని సైతం నింపుకోనున్నాయి. ఏకధాటిగా ప్రయాణించి ఫ్రాన్స్ నుంచి నేరుగా అంబాలాకు చేరుకుంటాయి. తద్వారా రాఫెల్ యుద్ధ విమానాల బలం 14కు చేరుకోనుంది. 2016లో కేంద్ర ప్రభుత్వం ఫ్రాన్స్ దేశంలో రాఫెల్ ఫైటర్ జెట్ల కోసం ఒప్పందాన్ని కుదుర్చుకోవడం తెలిసిందే. మొత్తం 36 యుద్ధ విమానాల కోసం భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య భారీ ఒప్పందం కుదిరింది. ఇదివరకు రెండు దఫాలుగా రాఫెల్ ఫైటర్ జెట్స్ భారత్‌కు చేరుకున్నాయి.


 Also Read: PAN-Aadhaar Linking: పాన్ కార్డ్, ఆధార్ అనుసంధానం చేసుకున్నారా, నేటితో ముగియనున్న డెడ్‌లైన్


తాజాగా మరో మూడు యుద్ధ విమానాలు సిద్ధం చేసినట్లు ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ సమాచారం అందించింది. దాని ప్రకారం 
భారత వైమానిక బృందం ఇటీవల ఫ్రాన్స్‌ చేరుకుంది. ఫ్రాన్స్‌ నుంచి బయలుదేరిన టీమ్ మూడు రాఫెల్ యుద్ధ విమానాలతో భారత్‌కు బయలుదేరగా, నేడు అంబాలాకు చేరుకోనున్నాయి. ఏప్రిల్ చివరి నాటికి మరో 5  రాఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు ఫ్రాన్స్ అప్పగించనుంది.  


Also Read: Internet Speed: వినియోగదారులకు శుభవార్త చెప్పిన బీఎస్ఎన్ఎల్, ఇక 4G వేగంతో  ఇంటర్నెట్


ఈ ఒప్పందంలో భాగంగా 2022 నాటికి మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రెంచ్‌ కంపెనీ డసాల్ట్‌ ఏవియేషన్‌ భారత్‌కు అందించాల్సి ఉంది. గత ఏడాది జులై 28న తొలి విడతలో 5 రాఫెల్ ఫైటర్ జెట్స్ భారత్ చేరుకోగా, మరో దఫాలో ఆరు భారత అమ్ములపొదిలో చేరాయి. తాజాగా మరో 3 రాఫెల్ యుద్ధ విమానాలతో గోల్డెన్‌ ఆరోస్ స్క్వాడ్రన్‌లో వాటి బలం 14కు చేరనుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook