Top 5 Earthquake Prone Countries: భూకంపం ఏర్పడినప్పుడు భూమి ఉపరితలం నందు ప్రకంపనలే కాకుండా కొన్ని సందర్భములలో భూమి బీటలు వారుతుంది. దీంతో ఎక్కువగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తాయి. భూ ఫలకాల కదలికలే భూకంపం రావడానికి ప్రధాన కారణం. ఇదే భూకంపం సముద్రం లోపలవస్తే అది సునామీగా మారే అవకాశం ఉంది. ఈ భూకంపాలను రిక్టర్ స్కేలుతో కొలుస్తారు. భూకంపాలు పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో అధికంగా సంభవిస్తాయి. దీంతో ఇక్కడి ఉండే దేశాలు తరుచుగా భూకంపాలకు గురవుతాయి. ప్రపంచంలో ఎక్కువగా భూకంపాలు వచ్చే దేశాలేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాప్-5 దేశాలు
జపాన్
పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉన్న దేశాల్లో జపాన్ ఒకటి. అందుకే ఈ దేశం తరుచూ భూకంపాలకు, సునామీలకు గురవుతుంది. దీంతో భూకంపాలను గుర్తించే టెక్నాలజీని ఈ దేశం అభివృద్ధి చేసింది. భూకంపం రాబోతుందని ముందుగానే చెప్పే హెచ్చరిక వ్యవస్థ కూడా జపాన్ దగ్గర ఉంది. భూకంపం లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉన్నప్పుడు ముందుగానే దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటుంది. 


ఇండోనేషియా
ఇది ప్రపంచంలో అత్యధిక భూకంపాలకు గురయ్యే దేశాలలో ఇది ఒకటి. ఇండోనేషియా దాదాపు ప్రతి సంవత్సరం 6.0 తీవ్రత కంటే పెద్ద భూకంపాలను చవిచూస్తుంది. ఈ విపత్తు వల్ల ఈ దేశం వేలాది మంది ప్రాణాలు కోల్పోయింది. 


చైనా 
భారీ భూకంపాలను ఎదుర్కొన్న దేశాల్లో చైనా ఒకటి. 2008లో సిచువాన్ ప్రావిన్స్‌లో 7.9 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 87,000 మంది మరణించారు. ఈ దేశం టెక్టోనిక్ పలకాల పైన ఉండటం వల్ల తరుచూ భూకంపాలకు గురవుతుంది. 


ఫిలిప్పీన్స్‌
పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉన్న దేశాల్లో ఇది ఒకటి. అందుకే ఈ దేశం కూడా తరుచూ భూకంపాలకు గురవుతుంది. ఇక్కడ కొండచరియలు విరిగిపడటం, టైఫూన్లు, మరియు ఉష్ణమండల తుఫానులు సర్వసాధారణం. ఈ ప్రకృతి విపత్తులను ఎదుర్కోనేందుకు ఇక్కడి ప్రభుత్వం పలు విధానాలను అవలంభిస్తోంది. 


ఇరాన్
ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు సంభవించే దేశాలలో ఇరాన్ ఒకటి. కొన్ని సంవత్సరాలుగా వేలాది మందిని బలిగొన్న వినాశకరమైన భూకంపాల చరిత్ర ఉంది. ఇరాన్‌ను తాకిన అత్యంత ఘోరమైన భూకంపాలలో గిలాన్ ప్రావిన్స్‌లో ఒకటి. 1990లో సంభవించిన ఈ భూకంపం ధాటికి 40,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దేశాలతోపాటు ఎక్కువగా భూకంపాలకు గురయ్యే దేశాలు జాబితాలో తుర్కియే, ఈక్వెడార్, పెరూ, యూఎస్ఏ, మెక్సికో, ఇటలీ తదితర దేశాలు ఉన్నాయి. 


Also Read: Earthquake in Turkey, Syria: టర్కీలో మరోసారి భారీ భూకంపం.. 1600 దాటిన మృతుల సంఖ్య!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook