ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేమే: ట్రంప్
`ఇజ్రాయెల్ రాజధాని జరుసలేమే.. దానికే మా ఓటు` అంటూ అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వివాదానికి తెరలేపారు.
వాషింగ్టన్: "ఇజ్రాయెల్ రాజధాని జరుసలేమే.. దానికే మా ఓటు" అంటూ అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వివాదానికి తెరలేపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు యావత్ ప్రపంచంలో కలవరం లేపుతోంది.
ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ కాదని.. చారిత్రక నేపథ్యమున్న జెరూసలేం మాత్రమే అని స్పష్టం చేశారు. మా ఎంబసీ, ఇతర కార్యాలయాలను మేము జెరూసలేంకు మరికొద్ది నెలల్లో తరలిస్తామని వ్యాఖ్యానించారు. అరబ్ నేతలతో సమావేశం అనంతరం తన మనసులోని మాటను బయటకు చెప్పారు.
పాలస్తీనా అధ్యక్షుడు మహమౌద్ అబ్బాస్, జోర్దాన్ రాజు అబ్దుల్లా, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తాహ్ ఎల్- సీసీ, సౌదీ రాజు సల్మాన్ తదితరులతో మాట్లాడిన అనంతరం ట్రంప్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇది చాలా కాలంగా ఉన్న డిమాండ్. ఈ విషయంపై చాలా చర్చలు కొనసాగాయి. పాలస్తీనా వాసులతో చర్చించాకే ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నామని చెప్పారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతించారు. కానీ కొన్ని దేశాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. అందులో చైనా ఒకటి. చైనా ట్రంప్ నిర్ణయంతో ఏకీభవించలేదు. ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం పొంచి ఉందన్నారు. అమెరికా మిత్రదేశం బ్రిటన్ "ఆందోళన" వ్యక్తం చేసింది. జెరూసలేంను రాజధానిగా ప్రకటించండం "పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య ఫైనల్ సెటిల్మెంట్ లో భాగంగా తీసుకున్న నిర్ణయమేనా? అంది.
అయితే ట్రంప్ ఈ అంశంపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ట్రంప్ అధికారికంగా మీడియా ముందు చెప్పాకే ప్రపంచ దేశాలు స్పందించనున్నాయి. ఆ సమయం కోసం వేచి చూస్తున్నాయి. నేడు ట్రంప్ వైట్ హౌస్ లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.