అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ భారత్ - పాక్ వివాదంలో జోక్యం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కశ్మీర్ అంశం ప్రస్తావించకుండానే భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు తన వంతు ప్రయత్నిస్తానంటూ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు శ్వేత సౌధ్యంలో విలేఖరుల సమావేశంలో భారత్ - పాక్ అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ భారత ప్రధాని మోడీని తర్వలోనే కలుస్తానని ప్రకటించారు. అలాగే పాక్ ప్రధాని ఇమ్రాన్ తో కూడా భేటీ అవుతానని ప్రకటించారు.


కశ్మీర్ అంశం తమ అంతర్గత వ్యవహారమని ఇందులో ఎవరి జోక్యం సహించబోమని భారత్ అనేక వేదికలపై తెగేసి చెప్పిన విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో ఇమ్రాన్ సర్కార్ కశ్మీర్ అంశంపై అమెరికా సహా అంతర్జాతీయ జోక్యం కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇలాంటి ప్రకటన చేయడం గమనార్హం. మరి భారత్- పాక్ విషయంలో ట్రంప్ జోక్యం ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.