Trump warns Hamas: ఇజ్రాయిల్- హమాస్ ల మధ్య  యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మిలిటెంట్ సంస్థపై విరుచుకుపడ్డారు. తాను అధికార అధికారం చేపట్టే లోపు బందీలను విడుదల చేయాలని హెచ్చరించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీ చర్చలు నేను దెబ్బతీయాలనుకోవడం లేదు. కానీ నా బాధ్యతలు స్వీకరించేసరికి వారు తిరిగి రాకపోతే పచ్చిమాసియాలో ఆకస్మిక దాడులు జరుగుతాయని ట్రంప్ పేర్కొన్నారు .  ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు.


బందీల విడుదలపై చర్చలు చివరి దశకు చేరుకున్నాయని.. మధ్యప్రాచ్యంలోని అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవెన్ చార్లెస్ విట్కాఫ్ విలేకరులకు తెలిపారు. బంధీల విడుదలకు చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. మేము  ఇందులో గొప్ప పురోగతి సాధించినాము. డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించే నాటికి మేము కొన్ని మంచి అవకాశాలు ప్రకటించాలని ఆశిస్తున్నాము అని తెలిపారు.


 హమాస్ ఇప్పటికే బంధీలను విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికి విడుదల చేయలేదు. ఇది ఆ సంస్థకు అంత మంచిది కాదు. అక్టోబర్ 7 నాటికి దాడులు మళ్ళీ జరగకూడదు. ఆ దాడుల్లో అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. నాకు ఇజ్రాయిల్ నుంచి చాలామంది ఫోన్ చేశారు. బందీలని త్వరగా విడిపించాలని వేడుకుంటున్నారు. అమెరికాకు చెందిన కొందరు పౌరులు కూడా  అక్కడ బందీలుగా ఉన్నారు. బందీల తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి వారి బాధను పంచుకుంటున్నారు అంటూ విట్కాఫ్ పేర్కొన్నారు.


Also Read: సంక్రాంతికి కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ కారుపై ఏకంగా 3 లక్షల వరకు డిస్కౌంట్..పండుగ ఆఫర్ అదరహో


 కాగా ట్రంప్ గతంలోనూ హమాస్ కు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  జనవరి 20వ తేదీన తాను అధికార బాధ్యతలు చేపట్టే లోపు బందీలను విడుదల చేయాలని పేర్కొన్నారు. లేకపోతే ఈ దురాగాతలకు పాల్పడే వారికి నరకం చూపిస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. చరిత్రలో ఎన్నడూ చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ఇజ్రాయిల్ జాతీయుడైన 20ఏండ్ల ఎడాన్ అలెగ్జాండర్  వీడియోను ఆ సంస్థ విడుదల చేసిన వేళ ట్రంప్ ఈ హెచ్చరికలు జారీ చేశారు .


2023లో హిజ్రాయిల్ పై హమాస్ దాడి చేయడంతో సుమారు 1200 మందికి పైగా  మరణించారు.  251 మందిని ఆ సంస్థ బంధించి గాజాలోకి తీసుకెళ్లింది. మధ్యలో తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం వేళ కొందరు బంధీలు విడుదల అవ్వగా ఇంకా 97 మంది హమాస్  లోనే ఉన్నారు. అయితే పలు ఘటనలో కొంతమంది మరణించారు. ప్రస్తుతం 51 మంది మాత్రమే సజీవంగా ఉండి ఉంటారని ఇజ్రాయిల్ మీడియా పేర్కొంది.


Also Read: Gold Rate Today: బంగారం ధర తగ్గింది.. నగలు కొనాలంటే ఇదే మంచి ఛాన్స్.. నేడు తులం ఎంతుందంటే?  


 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.