APPSC Notifications: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ జాబ్ నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. సంక్రాంతికి ముందే నిరుద్యోగులకు పండుగ కానుక అందించనుంది. ఈ నెల 12వ తేదీన భారీగా ఉద్యోగాలతో నోటిఫికేషన్ జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. మొత్తం 2,686 ఖాళీలను భర్తీ చేయనుంది. ఏ కేటగరీలో ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని నోటిఫికేషన్లనే వివరాలు తెలుసుకుందాం.
ఏపీపీఎస్సీ నుంచి శుభవార్త, ఇప్పటికే ఖాళీ అయిన 1670 పోస్టులతో పాటు కొత్తగా 1,016 పోస్టులు కలిపి మొత్తం 2,686 ఉద్యోగాల భర్తీకు అంతా సిద్ధమైంది. ఈ నెల 12వ తేదీన 19 నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు కూడా 150 ఉన్నాయి. ఇవి కాకుండా వివిధ వర్శిటీలు, ఆర్జేయూకేటీల్లో 3వేలకు పైగా ఖాళీలు భర్తీ కానున్నాయి. గత ప్రభుత్వం ఈ ఏడాదిలో నోటిఫికేషన్లు జారీ చేసినా ఎన్నికల కారణంగా నిలిచిపోయింది. ఇప్పుడు వాటితో పాటు కొత్తగా ఖాళీ అయిన పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది.
ఏపీపీఎస్సీ భర్తీ చేయదల్చిన ఉద్యోగాల్లో జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ 7 పోస్టులు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లైబ్రేరియన్ సైన్స్ జూనియర్ లెక్చరర్ 2, మున్సిపల్ ఎక్కౌంట్స్ సబార్డినేట్ సర్వీస్ 11 పోస్టులు, అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు 10, హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు 2, పిషరీస్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్ఠర్ పోస్టులు 3, గ్రౌండ్ వాటర్ టెక్నికల్ అసిస్టెంట్ 4, ఫారెస్ట్ ఆఫీసర్ 100, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 256 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 987 పోస్టుల భర్తీకు గత ఏడాది జూలైలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్ 1 పోస్టులు 89, పోలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ పోస్టులు 99, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జూనియర్ లెక్చరర్ పోస్టులు 47, కాలేజీ లెక్చరర్ పోస్టులు 290 ఉన్నాయి.
ఇప్పటికే జారీ అయిన నోటిఫికేషన్ల ప్రకారం మొత్తం ప్రక్రియను జూన్‌లోగా పూర్తి చేసి ఏపీపీఎస్సీ ప్రణాళికలు సిద్ధం చేసింది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష యధావిధిగా ఫిబ్రవరి 23న జరగనుంది. ఇక గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు మే నెలలోనూ, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ పోస్టుల పరీక్షలు జూన్‌లో జరగనున్నాయి. జూలై నుంచి డిసెంబర్ నాటికి కొత్తగా విడుదల చేయనున్న 19 నోటిఫికేషన్ల ప్రక్రియ పూర్తి కావచ్చు.
Also read: Makar Sankranti 2025: మకర సంక్రాంతి నుంచి ఈ 5 రాశులకు మహర్దశే, ఊహించని డబ్బు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.