Turkey Earthquake: 17కి చేరిన మృతుల సంఖ్య.. వందలాది మందికి గాయాలు
రీ భూకంపంతో టర్కీ, గ్రీస్ చిగురుటాకుల్లా వణికిపోయాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా ( Strong Earthquake) నమోదై ఏజియన్ సముద్రంలో సునామినే సంభవించింది. ఈ భూకంపం ధాటికి ప్రాణ, ఆస్థి నష్టం భారీగా సంభవించింది.
Strong Earthquake In Turkey - Death toll at 17: న్యూఢిల్లీ: భారీ భూకంపంతో టర్కీ, గ్రీస్ చిగురుటాకుల్లా వణికిపోయాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా ( Strong Earthquake) నమోదై ఏజియన్ సముద్రంలో సునామినే సంభవించింది. ఈ భూకంపం ధాటికి ప్రాణ, ఆస్థి నష్టం భారీగా సంభవించింది. ఈ భూకంపంతో ఇజ్మీర్ తీరప్రాంతంలోని నగరంలో ఇప్పటివరకు 17 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడ్డారు. అయితే టర్కీ (Turkey Earthquake) లోని ఇజ్మీర్ నగరంలో ( Izmir city ) కుప్పకూలిన భవనాల కింద వేలాది మంది ఉన్నారని అధికారులు పేర్కొంటున్నారు.
శిథిలాలను తోలగించేందుకు రెస్క్యూ ఆపరేషన్ నిరాంతరాయంగా జరుగుతోంది. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఇప్పటివరకు 17 మంది మరణించారని, 709 మంది గాయపడ్డారని టర్కీ విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది. కుప్పకూలిన 17 భవనాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తెలిపారు. Also read: Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.0 గా నమోదు
ఇదిలాఉంటే.. టర్కీ తీరప్రాంతం, గ్రీస్‌లోని సమోస్ దీవి మధ్య ఏజియన్ సముద్రంలో భారీ భూకంపం వచ్చిన తరువాత ఈ ప్రాంతంలో 196 సార్లు భూమి కంపించినట్లు టర్కీ మీడియా వెల్లడించింది. ఈ క్రమంలో భూకంపం తరువాత గ్రీస్, టర్కీలలో ఏర్పడిన పరిస్థితిని డబ్ల్యూహెచ్ఓ నిశితంగా పరిశీలిస్తుందని డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ పేర్కొన్నారు. వారి అవసరమైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. Also read: Urmila Matondkar: మహారాష్ట్ర ఎగువ సభకు నటి ఊర్మిళ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe