Drank Urine to Survive Under Turkey Earthquake Debris : టర్కీ భూకంపం ఎన్నో వేల మందిని బలి తీసుకోవడమే కాదు.. కొన్ని వేల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కూలిన భవనాల శిథిలాల మాటున ఎన్నో బతుకులు ఛిద్రమయ్యాయి.. ఇంకెన్నో కుటుంబాలు జీవిత కాలం కోలుకోలేని స్థాయిలో దెబ్బతిన్నాయి. శిథిలాల కింద సజీవ సమాధి అయిన వారితో పాటే ఇంకొంత మంది బతుకుజీవుడా అంటూ ప్రాణాలు గుప్పిట పట్టుకుని నాలుగైదు రోజుల పాటు ఊపిరి బిగపట్టుకుని బతికి రెస్క్యూ టీమ్ సహాయంతో బతికి బట్ట కట్టగలిగారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అద్నాన్ ముహమ్మెద్ కోర్కూట్ అనే 17 ఏళ్ల యువకుడు నిద్రలో ఉండగా భూకంపం సంభవించింది. ఈ భూకంపంతో తాను నిద్రిస్తున్న బిల్డింగ్ కుప్పకూలింది. అద్నాన్ శిథిలాల కింద అట్టడుగున చిక్కుకుపోయాడు. శిథిలాల బయట రెస్క్యూ టీమ్ శబ్ధాలు వినిపిస్తున్నాయి. తాను కూడా కేకలు పెట్టాను. తన గొంత బయటికి వినిపించదేమో అనుకున్నాను. కానీ 4 రోజుల అనంతరం రెస్క్యూ టీమ్ నన్ను చేరుకుంది. అప్పటి వరకు తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక నానా అవస్థలు పడ్డాను. అసలు బతుకుతాననే అనుకోలేదు. ఇక బయటి ప్రపంచం చూస్తాను అని అనుకోలేదు. దాహం తట్టుకోలేక నా మూత్రం నేనే తాగాను. శిథిలాల కింద కంటికి కనిపించిన పూలు తిని కడుపు నింపుకున్నాను అని ఆ నాలుగు రోజుల పాటు తాను చూసిన ప్రత్యక్ష నరకాన్ని బయటి ప్రపంచానికి చెప్పుకొచ్చాడు. 


టర్కీలోని గాజియన్‌టెప్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టర్కీ, సిరియాలో ఇలాంటి ఘటనలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. టర్కీ, సిరియా.. రెండు దేశాల్లో కలిపి భూకంపం కారణంగా మొత్తం 24 వేలకుపైగా జనం ప్రాణాలు కోల్పోయారు. కొంతమందిని నాలుగైదు రోజుల తరువాత కూడా ప్రాణాలతో కాపాడినప్పటికీ.. ఆకలి తట్టుకోలేక, ఆక్సీజన్ అందక, గాయాలతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యే అత్యధికంగా ఉందని టర్కీ, సిరియాల్లో భూకంపం తరువాత అక్కడి మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్న వార్తా కథనాలు స్పష్టంచేస్తున్నాయి.


ఇది కూడా చదవండి : Samsung Galaxy S23 Ultra: ఈ 200MP కెమెరా సూపర్ స్మార్ట్ ఫోన్‌పై రూ. 8వేల డిస్కౌంట్


ఇది కూడా చదవండి : Okaya Faast F3 EV Scooter: మార్కెట్లోకి మరో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆకట్టుకుంటున్న ఫీచర్స్


ఇది కూడా చదవండి : Renault Kwid Prices: మరింత తక్కువ ధరలో రెనో క్విడ్ RXE వేరియంట్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook