Turkey: మత ప్రబోధకుడికి 1,075 ఏళ్ల జైలు.. ఎందుకో తెలుసా?
వివాదాస్పద ముస్లిం ప్రబోధకుడికి టర్కీ కోర్టు నుంచి గట్టి షాక్ తగిలింది. ఆయన చేసిన నీచపు పనులు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో.. 1,075 ఏళ్ల భారీ జైలు శిక్షను విధిస్తూ ఆదేశాలిచ్చింది.
Turkish televangelist Adnan Oktar sentenced to 1,075 years | ఇస్తాంబుల్: వివాదాస్పద ముస్లిం ప్రబోధకుడికి టర్కీ కోర్టు నుంచి గట్టి షాక్ తగిలింది. ఆయన చేసిన నీచపు పనులు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో.. 1,075 ఏళ్ల భారీ జైలు శిక్షను విధిస్తూ ఆదేశాలిచ్చింది. మైనర్లపై లైంగిక దాడులు, అత్యాచారం, గూఢచర్యం, బ్లాక్ మెయిలింగ్ తదితర 10 కేసుల్లో దోషిగా తేలిన ముస్లిం ప్రబోధకుడు అద్నన్ అక్తర్‌కు టర్కీ కోర్టు సోమవారం 1,075 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
అద్నన్ అక్తర్ ఓ ప్రైవేటు టీవీ ఛానెల్ ద్వారా మతపరమైన బోధనలు చేస్తూ టర్కీ (Turkey) సహా చాలా దేశాల్లో పేరును గడించాడు. అంతేకాకుండా రచయితగా కూడా ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. టీవీలో జరిగే చర్చల్లో మహిళల మధ్య కూర్చుని అసభ్యకర రీతిలో చర్చలు నిర్వహించేవాడు. ఆ మహిళలను కిటెన్స్ (పిల్లి పిల్లలు) అని పిలుస్తూ నీచంగా వ్యవహరించేవాడు.
దీంతో అద్నన్ (Adnan Oktar) నేర కార్యకలాపాలపై టర్కీ మీడియాలో ప్రసారం కావడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ఆధీనంలోని నిఘా సంస్థ అనాడోలు అద్నన్ నివాసాలపై దాడులు చేసి, 2018లో ఆయనతోపాటు చాలామంది అనుచరులను కూడా అదుపులోకి తీసుకుంది. అద్నన్ ఘోర పది (sex abuse, offenses) నేరాలకు పాల్పడినట్లు ప్రభుత్వ ఏజెన్సీ ఆధారాలతో సహా కోర్టుకు నివేదిక సమర్పించింది.
10 ప్రధాన కేసుల్లో అద్నాన్ దోషిగా (Crime) తేల్చిన టర్కీ కోర్టు ఈ శిక్షను విధించింది. దీంతోపాటు అతని అనుచరులు 13 మందికి సైతం కఠిన కారాగార శిక్షలు విధించింది. ఈ విషయంపై స్పందించిన 64 ఏళ్ల అద్నన్.. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. తాను ఏ తప్పు చేయలేదని.. కోర్టు తీర్పుపై అప్పీలు చేస్తానని చెప్పాడు.
Also Read: AK-521: ప్రపంచంలోనే అతి ప్రమాదకర రైఫిల్ ఇదే..నిమిషానికి వేగమెంతో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook