AK-521: ప్రపంచంలోనే అతి ప్రమాదకర రైఫిల్ ఇదే..నిమిషానికి వేగమెంతో తెలుసా

 

AK-521పేరుతో రష్యా అత్యంత ప్రమాదకమైన రైఫిల్ తయారు చేసింది. దీంతో 8 వందల మీటర్ల దూరంలో ఉన్న శత్రువుల్ని సైతం మట్టుబెట్టవచ్చు.

  • Jan 12, 2021, 19:14 PM IST

 

AK-521 : ప్రపంచపు అత్యంత ప్రమాదకర రైఫిల్‌గా ఇప్పటి వరకూ మనం ఏకే 47 గురించి చెప్పుకున్నాం.  ఇప్పుడీ రైఫిల్ మరింత ప్రమాదకరంగా మారింది. అడ్వాన్స్డ్ వర్షన్ AK 521గా అభివృద్ధి చెందింది. ఏకే సిరీస్‌లోని రైఫిల్స్‌లో ఇదే అత్యంత ప్రమాదకరమైందని అంటున్నారు.

1 /5

ఏకే 521 రైఫిల్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువేనట. ఇందులో 7,62 x 39 మరియు 5,56 x 45 బుల్లెట్స్‌ను ఉపయోగిస్తారు. దుర్బేధ్య ప్రాంతాల్లో మొహరించిన సైనికులు కూడా ఈ రైఫిల్‌ను అత్యంత సులభంగా వినియోగించవచ్చు.  కలాశ్నికోవ్ కన్సర్న్ ( Kalashnikov concern ) కంపెనీ త్వరలోనే ఉత్పత్తి పూర్తి చేసి..మిత్రదేశాలకు అమ్మకానికి పెట్టనుందని తెలుస్తోంది. 

2 /5

Ak 500 సిరీస్‌లోని ఇతర రైఫిల్స్‌లానే ఇందులో కూడా అప్పర్ అండ్ లోవర్ రిసీవర్ ఉంటుంది. ఈ రైఫిల్‌లో ఎక్కువ ఒత్తిడిని తట్టుకునేవిధంగా విడిభాగాల్ని మెటల్‌తో చేశారు. అటు రైఫిల్ మరియు మేగజీన్‌కు ఎగువన హోల్డింగ్ పాయింట్స్‌పై పాలిమర్ ప్రయోగించారు. 

3 /5

ఏకే 521 రైఫిల్ రేంజ్ 8 వందల మీటర్ల వరకూ ఉంటుంది. అంటే దాదాపు 8 వందల మీటర్ల దూరంలో ఉన్న శత్రువును సైతం ఈ రైఫిల్ టార్గెట్ చేయగలదు. అయితే కంపెనీ ఇంకా అధికారికంగా రైఫిల్ రేంజ్ గురించి ప్రకటన జారీ చేయలేదు.

4 /5

ఈ ఏకే 521 రైఫిల్‌లో ఆప్ట్రిక్స్ బైండింగ్ , బ్యారెల్ మధ్య ఓ బలమైన లోహాన్ని వినియోగించారు. దీంతో ఆపరేషన్ లేదా మెయింటెనెన్స్ సందర్బంగా ఇందులో లోపం తలెత్తే అవకాశముండదు. కేవలం ఒక్క నిమిషంలోనే వేయి బుల్లెట్లు కురిపించగల వేగం ఏకే 521 సొంతమట.

5 /5

కలాశ్నికోవ్ కన్సర్న్‌కు చెందిన ఏకే 47 రైఫిల్స్ ప్రపంచంలో 25 కంటే ఎక్కువ దేశాల్లో సైనికులు వినియోగిస్తున్నారు. మెయింటెనెన్స్ కారణంగా ప్రపంచంలోని తీవ్రవాద సంస్థలు కూడా ఎక్కువగా ఏకే 47ను ఇష్టపడుతుంటారు.