Viral Video: బాక్సింగ్ రింగ్‌లో ఇద్దరు పొలిటిషియన్లు తలబడితే ఎలా ఉంటుంది... ఇదిగో ఇలా...
Brazil politicians fight video: ప్రజాస్వామ్యంలో ఏ సమస్యకైనా చర్చలతో, శాంతియుత పద్దతుల్లో పరిష్కార మార్గం వెతుకుతారు. కానీ బ్రెజిల్‌కు చెందిన ఇద్దరు నేతలు మాత్రం ఏకంగా మార్షల్ ఆర్ట్స్ ఫైట్‌కు దిగారు.
Brazil politicians fight video: రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు కామన్. దమ్ముంటే చర్చకు రా.. అంటూ సవాళ్లు విసురుకోవడమూ కామన్. కానీ చర్చలతో తేల్చుకుంటే కిక్కేముంది అనుకున్నారో ఏమో... ఏకంగా బాక్సింగ్ రింగ్‌లోకి దిగి తలబడ్డారు ఇద్దరు పొలిటీషియన్స్. బ్రెజిల్‌కు (Brazil) చెందిన పీక్సోటో, అల్వాస్ డా సిల్వా అనే ఆ ఇద్దరు నేతల ఫైటింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సిమావో పీక్సోటో ప్రస్తుతం బ్రెజిల్‌లోని (Brazil) బోర్బా నగర మేయర్‌గా కొనసాగుతున్నారు. పీక్సోటోపై ఇటీవల మాజీ మేయర్ అల్వాస్ డా సిల్వా పలు విమర్శలు, ఆరోపణలు చేశారు. స్థానిక వాటర్ పార్క్ నిర్వహణలో మేయర్ పీక్సోటో విఫలమయ్యారని ఆరోపించారు. అతనో మోసగాడని విమర్శించారు. అక్కడితో ఆగక... దమ్ముంటే తనతో ఫైటింగ్‌కు రావాలని సవాల్ విసిరాడు. అటు పీక్సోటో కూడా అంతే ధీటుగా రియాక్ట్ అయ్యాడు. డా సిల్వాతో ఫైట్‌కు సిద్ధమని ప్రకటించాడు. దీంతో ఇద్దరి మధ్య మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA fight) ఫైట్ నిర్వహించారు.
సుమారు 13 నిమిషాల పాటు జరిగిన ఈ ఫైట్‌లో (Fight between Politicians) మేయర్ పీక్సోటోని మాజీ మేయర్ డా సిల్వా చిత్తుగా ఓడించాడు. ఫైట్ అనంతరం ఇద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం గమనార్హం. ఇద్దరు పొలిటీషియన్స్ మధ్య జరిగిన ఈ ఫైట్‌కు ప్రేక్షకులు కూడా భారీగా ఎగబడ్డారు. దీంతో ఈ మ్యాచ్ కోసం ఒక్కో టికెట్‌ను R$100 (Brazil currency)కి విక్రయించారు. ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతున్నంత సేపు ప్రేక్షకులు ఈలల, కేకలతో హోరెత్తించారు. ఆదివారం (సెప్టెంబర్ 12) జరిగిన ఈ ఫైట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ (Viral Video) అవుతోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన రాజకీయ నాయకులే ఇలా యుద్ధాలకు దిగి దేశానికి ఏం సందేశమిస్తున్నట్లు... ఇలా యుద్ధాలకు దిగే పనే అయితే ఇక ప్రజాస్వామ్యం ఎందుకని... వీడియో చూసిన పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Also Read: Natasha Stankovic: పాపం హార్ధిక్ పాండ్యా-మరో వ్యక్తితో భార్య రొమాన్స్-వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి