Planes Mid Air Collission: అమెరికాలోని నార్తర్న్ కాలిఫోర్నియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వాట్సన్‌విల్లే ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ సమయంలో రెండు విమానాలు గాల్లోనే ఢీకొన్నాయి. 200 మీ. ఎత్తులో ఉన్న సమయంలో విమానాలు రెండు ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందారు. అయితే మృతుల సంఖ్యపై మాత్రం స్పష్టత రాలేదు. గురువారం (ఆగస్టు 18) మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్విన్ ఇంజిన్ సెస్నా 340, సింగిల్ ఇంజిన్ సెస్నా 153 విమానాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో ఒక విమానంలో ఇద్దరు, మరో విమానంలో పైలట్ మాత్రమే ఉన్నట్లు తెలిపారు. ఈ ముగ్గురిలో ఇద్దరు చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. 


వాట్సన్‌విల్లే ఎయిర్‌పోర్ట్‌కు కంట్రోల్ టవర్ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ల్యాండింగ్, టేకింగ్‌కి ఎటువంటి కంట్రోల్ సిస్టమ్ లేకపోవడంతో ప్రమాదం జరిగిందంటున్నారు. ఏడాదికి 55 వేల ఆపరేషన్స్ ఉండే ఎయిర్‌పోర్ట్‌కు కంట్రోల్ టవర్ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఎయిర్‌పోర్టును ఎక్కువగా రీక్రియేషనల్ ప్లేన్స్, అగ్రికల్చర్ వ్యాపారాల కోసం వాడుతారని తెలుస్తోంది. తాజా ప్రమాద ఘటనపై ప్రస్తుతం ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విచారణ జరుపుతోంది. 


Also Read: నితీశ్ వ్యవహారం అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్‌ను మార్చినట్లుగా ఉంది.. బీహార్ సీఎంపై బీజేపీ నేత అనుచిత విమర్శలు   


Also Read:Horoscope Today August 19th : నేటి రాశి ఫలాలు.. ఈ రెండు రాశుల వారిని నిరాశ, నిస్తేజం అలుముకుంటుంది..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook