న్యూయార్క్: అమెరికాలో మరోసారి రికార్డు స్థాయిలో ఒక్కరోజే 50,700 మేరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అమెరికా వ్యాప్తంగా రోజురోజుకూ కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ అమెరికాలోని రాష్ట్రాలలో వైరస్ ఉధృతి తీవ్రంగా ఉంది. వివిధ రాష్ట్రాలలో ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ మొదలైన నేపథ్యంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడం అమెరికన్లను కలవరపరుస్తోంది. క్యాలిఫోర్నియా రాష్ట్రంలో మళ్లీ బుధవారం నుంచి బార్లు, థియేటర్లు, ఇండోర్ రెస్టారెంట్లు మరోసారి మూతపడ్డాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: ఏపీలో 16 వేలు దాటిన కరోనా కేసులు.. 200కు చేరువలో మరణాలు


మరోవైపు అరిజోనాలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరాన్ని పాటించకపోవడం వల్లనే అమెరికాలో వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ప్రపంచంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు, వైరస్ కారణంగా మరణాలు సంభవిస్తున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం వీటిపై ఏమాత్రం ఆందోళన కనబరచడం లేదు. ఏదో ఒక దశలో కోవిడ్-19 దానంతటదే అదృశ్యం అవుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నట్లు ఫాక్స్ బిజినెస్‌కు ఇచ్చిన ఇంటర్వూంలో ఆయన ధీమా వ్యక్తం చేశారు. 


Also Read: AP: ఆంధ్రప్రదేశ్ లో ఇకపై అన్ లాక్ 2: సడలింపులు ఇవే


 ఇంటికి పిలిచి తోబుట్టువులనే కడతేర్చిన ఉన్మాది   జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
 బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!