కరోనాకు కొత్త పేరు పెట్టిన ట్రంప్....

ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్ కు కుంగ్ ఫ్లూ’  పేరును అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పెట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి చైనానే కారణమని  విమర్శించారు.  సెంట్రల్ చైనా సిటీ

Last Updated : Jun 21, 2020, 04:19 PM IST
కరోనాకు కొత్త పేరు పెట్టిన ట్రంప్....

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్ కు కుంగ్ ఫ్లూ’  పేరును అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పెట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి చైనానే కారణమని  విమర్శించారు.  సెంట్రల్ చైనా సిటీ అయిన వూహాన్‌లో కరోనా పుట్టిందని భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు మార్లు డ్రాగన్ కంట్రీపై అమెరికా ప్రెసిడెంట్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. అలాగే వైరస్‌కు దాని పుట్టుకకు సంబంధించిన పేరుగా ‘వూహాన్ వైరస్‌’ అని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్స్ గతంలో పేరు పెట్టారు. Weather updates: మూడు రోజుల పాటు భారీ వర్షాలు

 ( Read also: International Yoga day 2020: కరోనా కష్టాలకు ప్రాణాయామంతో చెక్: ప్రధాని మోదీ )

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓక్లహామాలోని టల్సాలో నిర్వహించిన మొదటి ఎలక్షన్ ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ దీనిపై ఘాటుగా స్పందించారు. కరోనాకు కుంగ్ ఫ్లూ అని పేరు పెడుతున్నానని, ఇంకా 19 రకాల వైవిధ్యమైన పేర్లను నేను పెట్టగలన్నారు. దానిని చాలా మంది వైరస్ అంటారు. నాకు తెలిసి మనం 19 నుంచి 20 రకాల పేర్లు పెట్టుకున్నాం’ అని ట్రంప్ అన్నారు. చైనాలో కుంగ్ ఫూ అనే మార్షల్ ఆర్ట్స్ చాలా ఫేమస్ అన్న విషయం తెలిసిందే. దాని పేరు మీదే చైనాను దెబ్బకొట్టడానికే కుంగ్ ఫ్లూ అనే పేరును ట్రంప్ పెట్టారని విశ్లేకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, జాన్స్ హాప్కిన్స్ కరోనా వైరస్ రీసోర్స్ సెంటర్ ప్రకారం.. మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 4.50 లక్షల మంది చనిపోయారని ఇప్పటివరకున్న సమాచారం.

 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 

Trending News