UAE President passes away: యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా కన్నుమూత
UAE President dies: యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (73) కన్నుమూశారు. ఈ విషయాన్ని అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది.
UAE President Sheikh Khalifa bin Zayed dies: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు (UAE President) షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (73) శుక్రవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని అధ్యక్షవ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఈయన నవంబర్ 3, 2004 నుండి యూఏఈ అధ్యక్షుడిగా, అబుదాబి పాలకుడిగా పనిచేస్తున్నారు. ఈయన తండ్రి షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ 1971 నుంచి నవంబర్ 2, 2004 వరకు యూఏఈ మొదటి అధ్యక్షుడిగా సేవలందించారు. ఆయన మరణానంతరం 1948లో జన్మించిన షేక్ ఖలీఫా యూఏఈ రెండో అధ్యక్షుడిగా, అబుదాబి 16వ పాలకుడిగా ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించారు.
యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (Sheikh Khalifa bin Zayed) మరణించినందుకు అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖ 40 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. యూఏఈ వేగంగా అభివృద్ధి చెందడంలో షేక్ ఖలీఫా తీవ్రమైన కృషి చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ప్రజల శ్రేయస్సు కోసం ఆయన తన మొదటి వ్యూహాత్మక ప్రణాళికను ప్రారంభించారు. నార్తర్న్ ఎమిరేట్స్ అవసరాలను అధ్యయనం చేయడానికి దేశమంతటా విస్తృతంగా పర్యటించారు. అదే విధంగా అనేక ప్రాజెక్టులకు సంబంధించి పలు సూచనలిచ్చారు. ఫెడరల్ నేషన్ కౌన్సిల్ సభ్యుల కోసం నామినేషన్ విధానాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు.
Also Read; Ranil wickremesinghe as Srilanka New PM: సంక్షోభ శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook