UK Covid updates England's COVID prevalence rises to highest since start of year, ONS say: బ్రిటన్ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. యూకేను కోవిడ్ (UK Covid) ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆ దేశంలో మళ్లీ జనవరి నాటి ఉద్ధృతి కనిపిస్తోంది. నిత్యం సుమారు 40 వేల కేసులు వెలుగుచూస్తున్నాయి. అక్టోబర్ 22తో ముగిసిన వారంలో ప్రతి 50 మందిలో ఒకరికి (One person in 50 had Covid) వైరస్ సోకిందని ఆఫీస్‌ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్‌ స్పష్టం చేసింది. అంతకు ముందువారం 55 మందిలో ఒకరికి వైరస్ వ్యాప్తి చెందినట్లు వెల్లడించింది. ఇక ఇదే ఏడాది జనవరిలో (January) బ్రిటన్‌లో కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందింది. జనవరి రెండుతో ముగిసిన వారంలో కూడా ప్రతి 50 మందిలో (50 people) ఒకరికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : WhatsApp to Stop Some Phones: నవంబర్ 1 నుంచి ఆ ఫోన్లలో నిలిచిపోనున్న వాట్సాప్ సేవలు!


మరోపక్క యూకేలో కోవిడ్ వ్యాక్సినేషన్‌ (Covid Vaccination‌) కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. దీంతో కరోనాతో ఆసుపత్రిలో చేరికలు, మరణాలు కాస్త అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్ (Covid) వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో పది రోజుల కిందట 50 వేలకు చేరిన రోజువారీ కొత్త కేసులు.. ఇప్పుడు 43 వేలకు పడిపోయాయి. మరణాలు కూడా దాదాపు రెండువందల దాకా సంభవిస్తున్నాయి. అయితే ఆర్థికవ్యవస్థ పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తోన్న బ్రిటన్‌లో (Britain‌).. ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson) ఈ సారి లాక్‌డౌన్ (Lockdown) పెట్టకుండానే కోవిడ్‌ వ్యాప్తి తగ్గించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.


Also Read : Pushpaka Vimanam trailer: పుష్పక విమానం ట్రైలర్.. ట్విస్టులే ట్విస్టులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook