Pushpaka Vimanam trailer: పుష్పక విమానం ట్రైలర్.. పెళ్లయిన తర్వాత.. ట్విస్టులే ట్విస్టులు

Pushpaka Vimanam trailer: పుష్పక విమానం మూవీలో (Pushpaka Vimanam movie) ట్విస్టులు బోలెడు ఉన్నాయనిపించేలా పుష్పక విమానం ట్రైలర్ కట్ చేశారు. ఆనంద్ దేవరకొండ సరసన గీత్ శైని, శాన్వి మేఘన ఫీమేల్ లీడ్ రోల్స్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2021, 08:23 PM IST
Pushpaka Vimanam trailer: పుష్పక విమానం ట్రైలర్.. పెళ్లయిన తర్వాత.. ట్విస్టులే ట్విస్టులు

Pushpaka Vimanam trailer: విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన పుష్పక విమానం ట్రైలర్ తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ట్రైలర్ లాంచ్ చేశాడు. దామోదర అనే దర్శకుడు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను విజయ్ దేవరకొండ ప్రజెంట్ చేయగా గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మించారు. నవంబర్ 12న పుష్పక విమానం మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మేకర్స్ పుష్పక విమానం ట్రైలర్‌ను విడుదల చేశారు. 

కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ గవర్నమెంట్ స్కూల్ టీచర్‌కి లైఫ్ హ్యాపీగా సాగిపోతుందనుకుంటున్న తరుణంలో ఉన్నట్టుండి ఏదో అలజడి. పెళ్లి చేసుకుని హ్యాపీగా పట్నంలో కాపురం పెడదామని ప్లాన్ చేసిన ఆ స్కూల్ టీచర్ లైఫ్‌లో ఏం జరిగింది ? ఆ తర్వాత జీవితంలో ఎదురైన ఊహించని పరిణామాల ఆధారంగా అల్లుకున్న కథే ఈ పుష్పక విమానం. 

 

పుష్పక విమానం మూవీలో (Pushpaka Vimanam movie) ట్విస్టులు బోలెడు ఉన్నాయనిపించేలా పుష్పక విమానం ట్రైలర్ కట్ చేశారు. గీత్ శైని, శాన్వి మేఘన ఫీమేల్ లీడ్ రోల్స్ చేశారు. సునిల్, సీనియర్ హీరో నరేష్, హర్షవర్థన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రామ్ మిరియాల, సిద్ధార్థ్ సదాశివుని, మార్క్ కే రాబిన్, అమిత్ దేశాని ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఆనంద్ దేవరకొండను ఆర్టిస్టుగా మరో మెట్టెక్కించే సినిమాలా పుష్పక విమానం ట్రైలర్ (Pushpaka Vimanam trailer) ఉందనిపిస్తోందంటున్నారు అభిమానులు.

Trending News