ప్రపంచంలోని అన్నిదేశాలు చైనా ( China ) ను పక్కనపెట్టేస్తున్నాయి. మొన్న ఇండియా..నిన్న అమెరికా..నేడు బ్రిటన్ ( Britan ) . రేపు మరో దేశం. అన్నిదేశాలు వాదించేది ఒక్కటే. దేశ భద్రతకు చైనాతో ముప్పుందని. 5 జి నెట్ వర్క్ నుంచి చైనా కంపెనీల్ని తప్పించడానికి బ్రిటన్ యోచిస్తోందిప్పుడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మొన్న ఇండియా ( India ) ..నిన్న అమెరికా..నేడు బ్రిటన్ తదితర దేశాలు వాదిస్తున్నట్టు నిజంగానే చైనా కంపెనీలు ఆయా దేశాల భద్రతకు ముప్పుగా పరిణమించాయా? వివిధ దేశాల సమాచారాన్నిచైనా కంపెనీలు ( Threat from china companies ) తమ ప్రభుత్వానికి అందిస్తున్నాయా అంటే అనుననే సందేహం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగానే చైనాకు చెందిన కంపెనీల్ని ప్రపంచదేశాలు ఒక్కొక్కటిగా కాదంటున్నాయి. చైనా దేశానికి చెందిన 59 యాప్ లను ముందు ఇండియా ( India Ban on China Apps ) నిషేధించింది. తరువాత అమెరికా అదే దిశగా చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు బ్రిటన్ సైతం చైనా కంపెనీల్ని పక్కన పెట్టడానికి రంగం సిద్దం చేస్తోంది. Also read: Sachin Pilot: సత్యాన్ని ఓడించలేరు


ముఖ్యంగా చైనాకు చెందిన టెలికాం కంపెనీల్ని తప్పించనుందని తెలుస్తోంది. చైనా దేశపు కంపెనీలతో దేశ భద్రతకు ముప్పుందని సాక్షాత్తూ ఎంపీలే ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో బ్రిటన్ లోని 5 జి నెట్ వర్క్ ( 5G network in Britan ) నుంచి హువావే టెలికాం సంస్థ ( Huawei Telecom company ) ను పక్కనబెట్టేందుకు బ్రిటన్ ప్రదాని బోరిస్ జాన్సన్ నిర్ణయించినట్టు సమాచారం. హువావే, జెడ్ టీ ఈ  ( ZTE Corp ) కార్ప్ సంస్థలకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ, చైనా సైనిక పరికరాలతో సంబంధముందని గతంలో అమెరికా ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు బ్రిటన్ ఇదే బాటలో పయనించనుంది. హాంకాంగ్ ( Hongkong ) లో జాతీయ భద్రతా చట్టాన్ని విధించాలన్న చైనా నిర్ణయంపై యూకే, ఇతర దేశాల్నించి విమర్శలు వెల్లువెత్తాయి. Also read: Coronavirus: వ్యాక్సీన్ తయారీలో రష్యా విజయం సాధించిందా?