Petrol Price reach 204 per Litre in Sri Lanka: రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. నెల రోజుల క్రితం వరకు 75 డాలర్లుగా ఉన్న ఓ బ్యారెల్‌ ధర ఏకంగా 103 డాలర్లు కావడంతో.. చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్‌ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా శ్రీలంక, పాకిస్తాన్ దేశాల్లో ప్రెటోలు ధరలు మంట మండుతున్నాయి. తాజాగా శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర డబుల్ సెంచరీ (రూ.204) కొట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధం మొదలైనప్పటినుంచి శ్రీలంకలో పెట్రోల్, డీజిల్‌ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శనివారం (ఫిబ్రవరి 26) ఒక్కరోజే పెట్రోల్ ధర రూ.20 పెరిగి ఏకంగా రూ.204కి చేరింది. మరోవైపు లీటర్ డీజిల్ ధర రూ.15 పెరిగి రూ.139కి చేరింది. లీటర్ పెట్రోల్‌పై రూ.20, డీజిల్‌పై రూ.15 పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ శ్రీలంక ఇండియన్ ఆయిల్ కంపెనీ తెలిపింది. 


అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారీగా పెరగడంతోనే పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరిగాయని శ్రీలంక ఇండియన్ ఆయిల్ కంపెనీ (ఎల్‌ఐఓసీ) పేర్కొంది. విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటడంతో చమురు కొనుగోళ్లు జరగలేదని లంక ప్రభుత్వం తెలిపింది. దేశంలో చాలా వరకు పెట్రోల్ పంపులు ఖాళీగా ఉన్నాయని కూడా చెప్పింది. ఈ ధరలు (రూ.204) లంక కరెన్సీ శ్రీలంక రూపీలో ఉన్నాయి. భారత రూపాయితో పోలిస్తే.. లంక రూపీ విలువ రూ.2.69 పైసలుగా ఉంది. ఈ ధరలపై శ్రీలంక వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం కారణంగా తీవ్రంగా కుదేలైన దేశాల్లో శ్రీలంక కూడా ఒకటి. ప్రధానంగా పర్యాటక రంగం, ఎగుమతులపై ఆధారపడిన లంక.. వైరస్ కారణంగా అతలాకుతలం అయింది. పర్యాటకులు లేక, ఎగుమతులు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. శ్రీలంకలో గత ఏడాది కాలంగా ఆహార, ఆర్థిక సంక్షోభం నెలకొంది. దిగుమతులపై నిషేధం కారణంగా నిత్యావసరాల ధరలు పెరిగాయి. ఇప్పుడు చమురు ధరలు కూడా పెరగడంతో జనాలు లబోదిబో అంటున్నారు. గత నెలలో రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం 25 శాతం పెరిగింది.


Also Read: Gold Rate Today 27 February 2022: మహిళలకు శుభవార్త.. మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు!!


Also Read: Horoscope 2022 February 27: నేటి రాశిఫలాలు.. ఆ రాశివారు ఒక శుభవార్త వింటారు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook