Russia-Ukraine War: రష్యాకు థ్యాంక్స్ చెప్పిన ఉక్రెయిన్, ఎందుకో తెలిస్తే నోరెళ్లబెడతారు
Russia-Ukraine War: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై దాడులు తీవ్రతరం చేస్తున్న రష్యా..అనుకోకుండా సొంతసైన్యంపైనే దాడి చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఎంతవరకూ నిజమనేది చూద్దాం..
Russia-Ukraine War: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై దాడులు తీవ్రతరం చేస్తున్న రష్యా..అనుకోకుండా సొంతసైన్యంపైనే దాడి చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఎంతవరకూ నిజమనేది చూద్దాం..
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై రెండు నెలలు దాటేస్తోంది. ఉక్రెయిన్ దేశంలోని చాలా నగరాలు ధ్వంసమయ్యాయి. ఈలోగా రష్యా సైన్యం పొరపాటున సొంత సైనికులపైనే దాడికి దిగిందనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్ చెబుతోంది. సొంత సైన్యంపై దాడి చేసుకున్నందుకు రష్యాసై ఉక్రెయిన్ అధికారులు థ్యాంక్స్ కూడా చెప్పుకున్నారు.
సొంత సైనికులపై ఫ్లేమ్‌త్రోవర్ ప్రయోగించిన రష్యా
ఇది కేవలం ఉక్రెయిన్ ఆరోపణే కాదు. ద మిర్రర్‌లో ప్రచురితమైన ఓ నివేదిక ప్రకారం రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో రష్యా సైన్యానికి గట్టి షాక్ తగిలింది. రష్యా సైనికులు పొరపాటున సొంత సైన్యాన్నే చంపేశారు. రష్యా సైన్యం సొంత సైనికులపై ఫ్లేమ్‌త్రోవర్‌తో దాడి చేసింది. అయితే ఉక్రెయిన్ సైనికులపై కాకుండా సొంత సైనికులపై దాడి చేస్తున్నట్టు రష్యాకు తెలియదు.
రష్యా సొంత సైనికులపైనే పొరపాటున దాడి జరుపుకున్న విషయాన్ని ఉక్రెయిన్ మిలట్రీ అధికారులు స్పష్టం చేశారు. అటు రష్యా సైనిక అధికారులకు కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నారు. ఈ విషయంలో తమకు సహాయం చేసినందుకు ఉక్రెయిన్ థ్యాంక్స్ చెబుతోంది. ఈ దాడి జపోరిజ్యా ప్రాంతంలో జరిగిందని తెలుస్తోంది. అయితే జరిగిన పొరపాటుపై రష్యా నుంచి ఇప్పటి వరకూ ఏ విధమైన ప్రకటన జారీ కాలేదు. ఈ దాడిలో రష్యా సైనికులు ఎంతమంది చనిపోయారనేది ఇంకా తెలియలేదు. అదే సమయంలో రష్యా సైనికులు యుద్ధాన్ని కొనసాగించకుండా ఉండేందుకు..తమ వాహనాల్ని తామే ధ్వంసం చేసుకుంటున్నారని ఉక్రెయిన్ అంటోంది.
అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. ఉక్రెయిన్‌తో సుదీర్ఘ యుద్ధానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సిద్ధమైనట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్ పై రష్యా ఆక్రమణ ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో 390 భవనాలు ధ్వంసమయ్యాయి. ఇందులో 222 రెసిడెన్షియల్ ఇళ్లున్నాయి.
Also read: Brain Aneurysm: బ్రెయిన్ ఎన్యూరిజమ్‌తో బాధపడుతున్న జిన్‌పింగ్, ఎంతవరకూ ప్రమాదకరమిది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.