Ukrainian: ఉక్రెయిన్ గగన తలంపై ఫ్లాష్ లైట్ రష్యా పని అనుకుని ఆందోళన.. చివరకు అంతా రిలాక్స్
బాంబులతో మోతమోగిన ఉక్రెయిన్ గగనతలంలో ఒక్కసారిగా కనపడిన ఫ్లాష్ లైట్ తో అక్కడి ప్రజలు భయాందోళనలో మునిగిపోయారు. అసలు విషయం తెలిసాక.. ఊపిరిపీల్చుకున్నారు.
Flash in the Ukrainian Sky: గడచిన సంవత్సర కాలంగా ఉక్రెయిన్ జనాలు బాంబుల మోతతో సహజీవనం సాగిస్తున్నారు. రష్యా చేస్తున్న యుద్దానికి ఇప్పటికే కొన్ని వేల మందిచి కోల్పోయిన ఉక్రెయిన్ ఇంకా కూడా ఆ ప్రభావం నుండి బయట పడలేదు. ఈమధ్య కాలంలో రష్యా దాడులు కాస్త తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్న ఉక్రెయిన్ ప్రజలు ఆందోళన చెందే విధంగా గగన తలంపై ఫ్లాష్ లైట్ కొన్ని సెకన్ల పాటు కనిపించి స్థానిక ప్రజలను ఆందోళనకు గురి చేసింది.
ఆ ఫ్లాష్ లైట్ కచ్చితంగా రష్యా పని అయ్యి ఉంటుందని భావించారు. బాంబు ఏదో వచ్చి పడుతుంది అంటూ భయాందోళనకు గురయ్యారు. కానీ అది నాసా కు చెందిన ఉపగ్రహం అంటూ ఆ తర్వాత వెళ్లడి అయ్యింది. ఆ ఉపగ్రహంను భూ వాతావరణంలోకి నాసా కూల్చింది. ఆ సమయంలో భారీగా ఫ్లాష్ లైట్ వచ్చింది. దాన్ని ఉక్రెయిన్ జనాలు బాంబు అయ్యి ఉంటుందని భావించి భయపడ్డారు. సరిగ్గా ఉక్రెయిన్ రాజధాని గగనతలంలో ఈ వింత ఏర్పడటం వల్ల కూడా రష్యా పని అయ్యి ఉంటుందని అంతా భావించారు.
బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ వెలుగు కనిపించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. రష్యాతో యుద్దం కారణంగా ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థ గగనతలం పై పని చేయడం లేదు. అందుకే కొన్ని నిమిషాల పాటు ఆ వెలుగు విషయంలో రక్షణ శాఖ కూడా ఆందోళన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత నాసా కు చెందిన ఉపగ్రహం భూమి మీద కూలిపోయే సమయంలో వచ్చిన వెలుగు అని ఉక్రెయిన్ రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు.
Also Read: Fire Accidents: రెండు అగ్ని ప్రమాదాల్లో 32 మంది మృతి
ఉక్రెయిన్ కు చెందిన పలు టీవీ ఛానల్స్ ఆ ఫ్లాట్ లైట్ ను లైవ్ ఇవ్వడంతో ప్రజలు భయబ్రాంతులకు గురి అయ్యారు. యుద్దం కారణంగా ఇప్పటికే చితికి పోయిన ఉక్రెయిన్ జనాలు ఇలాంటివి కనిపిస్తే వణికి పోతున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫ్లాష్ లైట్ గురించి కొందరు సరదాగా కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఉక్రెయిన్ ఆ కొన్ని నిమిషాలు పడ్డ ఆందోళనను గురించి చర్చించుకుంటున్నారు.
యుద్దం వల్ల ఎంతటి భయాణక పరిస్థితులు ఉంటాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రపంచంలో ఏ దేశం కూడా యుద్దం కోరుకోవద్దు అంటూ నెటిజన్స్ మరియు అంతర్జాతీయ మీడియా వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు. కాలం చెల్లిన ఉపగ్రహం భూమి మీదకు ప్రవేశిస్తున్న సమయంలో ఉక్రెయిన్ పడ్డ ఆంధోళన వారి ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది. ముందు ముందు అయినా వారు సాధారణ స్థితికి రావాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి.
Also Read: America Shoot: అమెరికాలో దారుణం.. ఇంటి కాలింగ్ బెల్ నొక్కాడని యువకుడిపై కాల్పులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.