America Shoot: అమెరికాలో దారుణం.. ఇంటి కాలింగ్ బెల్ నొక్కాడని యువకుడిపై కాల్పులు

Old Man Shoot Black Teen Boy In America: అమెరికాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన ఇంటి బెల్ మోగించాడని ఓ యువకుడిపై వృద్ధుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉండగా.. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2023, 04:49 PM IST
America Shoot: అమెరికాలో దారుణం.. ఇంటి కాలింగ్ బెల్ నొక్కాడని యువకుడిపై కాల్పులు

Old Man Shoot Black Teen Boy In America: అమెరికాలో వర్ణ వివక్ష కొత్తకాదు. ఇటీవల కొంత మార్పు వచ్చినా.. అక్కడక్కడ కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరైనా పొరపాటున మీ ఇంటి బెల్ మోగిస్తే ఏమంటారు.. సరైన చిరునామా చెప్పి పంపిస్తారు. కానీ తన ఇంటి డోర్ బెల్ రెండుసార్లు నొక్కాడని ఓ నల్లజాతీయ యువకుడిని శ్వేతజాతీయ వృద్ధుడు కాల్పుడు జరిపాడు. ప్రస్తుతం ఆ యువకుడు తీవ్రంగా గాయపడి ఆసుత్రిలో చికిత్స పొందుతున్నాడు. అమెరికాలో సోమవారం జరిగిన ఈ ఘటన భయాందోళనకు గురిచేసింది. పూర్తి వివరాలు ఇలా.. 
 
ఈ ఘటన అమెరికాలోని మిస్సోరిలో చోటుచేసుకుంది. రాల్ఫ్ పాల్ యార్ల్ (16) అనే నల్లజాతీయ యువకుడు తన కవల సోదరుల కోసం వెతుకుతున్నాడు. అలా వెతుకుతూ పొరబాటున ఓ ఇంటి కాలింగ్ బెల్ మోగించాడు. రెండు బెల్ నొక్కడంతో ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన 85 ఏళ్ల వృద్ధుడు.. కోపంతో రోల్ఫ్ పాల్‌పై కాల్పులు జరిపాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని ఆండ్రూ లెస్టర్‌ (85)గా గుర్తించి.. అరెస్ట్ చేశారు.  

నిందితుడు కాలింగ్ బెల్ మోగుతున్న సమయంలో తన ఇంటి గుమ్మంలో ఉన్న అద్దంలో నుంచి ఎవరో చూశాడు. బయట నల్ల జాతీయుడిని చూసి.. తుపాకీ తెచ్చుకుని డోర్ తీసి ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. రెండు రౌండ్లు కాల్పులు జరపగా.. ఒక బుల్లెట్ తలకు, మరొకటి చేతికి తగిలింది. హింస, ఆయుధాలను ఉపయోగించి నేరపూరిత సంఘటనకు పాల్పడినందుకు మిస్సోరి కోర్టు నిందితుడిపై కేసు నమోదు చేసింది. దోషిగా తేలితే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.

Also Read: Revanth Reddy News: ఒకే రోజులో 2 లక్షల ఉద్యోగాలా..! ఎలా ఇస్తారయ్యా..? బండి సంజయ్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్  

అయితే అరెస్ట్ అయిన 24 గంటల్లోనే జైలు నుంచి విడుదల కావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నింతుడిని అరెస్ట్ చేయాలంటూ కాన్సాస్ నగర ప్రజలు డిమాండ్ చేశారు. అతని ఇంటి ముందు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ ఘటనపై అమెరికా వైట్ హౌస్ కూడా స్పందించింది. యువకుడి పరిస్థితిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌ అడిగి తెలుసుకున్నారు.  

Also Read: Tax Saving Tips 2023: ఇలా చేయండి.. రూ.12 లక్షల జీతంపై ఒక్క రూపాయి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు

Also Read: OPS Latest Update: ఉద్యోగులకు తీపికబురు.. ఓపీఎస్‌ అమలుకు నోటిఫికేషన్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News