USA Bans China Apps: అమెరికా ప్రభుత్వం చైనాకు షాకిచ్చింది. చైనాకు చెందిన పలు యాప్స్‌ను బ్యాన్ చేసింది అక్కడి ప్రభుత్వం. ప్రస్తుతం సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు ట్రంప్ త్వరలో అధ్యక్షపదవి గద్దె దిగడానికి ముందు ఈ చర్యలు తీసుకోవడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం చైనాకు చెందిన 8 యాప్స్‌ను బ్యాన్ చేస్తూ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్‌పై సంతకం చేసింది. ఈ యాప్స్‌లో యాంట్స్ గ్రూప్ యాప్ అయిన అలీపేను బ్యాన్ చేసింది. దీన్ని అలీబాబా సంస్థ వ్యవస్థాపకుడు అయిన జాక్ మా లాంచ్ చేశాడు. దీంతో పాటు ట్యాంసెంట్‌ సంస్థకు చెందిన వీ చాట్ యాప్ కూడా ఉంది. ట్రంప్ పదవీ కాలం ముగియడానికి కొన్ని రోజుల ముందే ఈ ఆర్డర్ రావడం విశేషం.


అమెరికా (USA) ప్రభుత్వం చైనాపై చర్యలు తప్పకుండా తీసుకుంటుంది అని ట్రంప్ పలు సార్లు హెచ్చరించాడు. కానీ ప్రత్యక్షంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇకపై అమెరికా నిర్ణయాలు, చర్యలతో చైనాకు చెమటలు పట్టనున్నాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. బ్యాన్ అయిన యాప్స్‌లో అలీపే, క్యామ్ స్కానర్, క్యూక్యూ వ్యాలెట్, షేర్ ఇట్, ట్యాంసెంట్ క్యూ క్యూ, వీమేట్, వీచాట్ పే, డబ్ల్యూపీఎస్ ఆఫిస్ యాప్స్ ఉన్నాయి.  కాగా యూఎస్ చర్యలపై చైనా ఎలా స్పందిస్తుందో చూడాలి మరి!