US Congress certifies joe biden win | వాషింగ్ట‌న్‌: అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరన్న విషయంపై నెలకొన్న సందిగ్ధతకు గురువారం తెరపడింది. 46వ అధ్యక్షుడిగా డెమొక్రాటిక్‌ నేత జో బైడెన్‌ (Joe Biden) ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమం అయింది. అయితే క్యాపిటల్ హిల్‌పై ట్రంప్ మద్దతుదారుల దాడి తర్వాత యూఎస్ కాంగ్రెస్.. ఈ కీలక ప్రకటన చేసింది. నవంబర్‌ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (us election 2020) జో బైడెన్, కమలా హారిస్‌ విజయం (US Congress) సాధించినట్లు వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఎన్నిక‌ల్లో బైడెన్‌కు 306, ట్రంప్‌కు 232 ఎల‌క్టోర‌ల్ ఓట్లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ తర్వాత ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను అంగీక‌రించ‌డానికి నిరాక‌రిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం యూఎస్ కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలపై స్పష్టత ఇచ్చేందుకు సమావేశమైంది. ఈ సమావేశాన్ని అడ్డుకునేందుకు ట్రంప్ త‌న మ‌ద్ద‌తుదారుల‌ను రెచ్చ‌గొట్టి క్యాపిట‌ల్ భవనంపై దాడి చేసేలా ఉసిగొల్పారు. Also Read: ట్రంప్ ఇల్లు .. ఇంద్రభవనం తక్కువేం కాదు


దీంతో క్యాపిటల్ భవనంలో (US Capitol violence) తీవ్ర హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. బైడెన్‌ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ భవనంలోకి దూసుకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన (us capitol riots) కాల్పుల్లో ఓ మహిళతో సహా నలుగురు మరణించారు. ఈ హింస అనంతరం జరిగిన యూఎస్ కాంగ్రెస్ సమావేశంలో ఎల‌క్టోర‌ల్ ఓట్ల‌ను లెక్కించిన సభ్యులు బైడెన్ ఎన్నిక‌ను ధృవీక‌రిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


Also Read: Kim Jong Un సంచలనం.. తప్పిదాన్ని ఒప్పుకున్న ఉత్తర కొరియా అధినేత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook