తొలి ప్రయాణంలోనే పట్టాలు తప్పిన రైలు
వాషింగ్టన్ రాష్ట్రంలో ప్రయాణీకులతో వెళుతున్న రైలు పట్టాలు తప్పింది. 30 మైళ్ల వేగంతో ప్రయాణించాల్సిన జోన్ లో గంటకు 80 మైళ్ల వేగంతో ప్రయాణించడం వల్ల రైలు అదుపు తప్పింది.
వాషింగ్టన్ రాష్ట్రంలో ప్రయాణీకులతో వెళుతున్న రైలు పట్టాలు తప్పింది. 30 మైళ్ల వేగంతో ప్రయాణించాల్సిన జోన్ లో గంటకు 80 మైళ్ల వేగంతో ప్రయాణించడం వల్ల రైలు అదుపు తప్పింది అని రవాణా నిపుణులు చెబుతున్నారు.
"మూడు బోగీలు ఉన్న రైలులో కనీసం 80 మంది ప్రయాణీకులు, ఇద్దరు సర్వీసు సిబ్బంది ఉన్నారు. మొదటిసారి కొత్త మార్గంలో ఆ రైలు వెళుతుంది. వంతెనపై నుంచి వెళుతున్న రైలు పట్టాలు తప్పడంతో బోగీలు కిందున్న రోడ్డుపై పడ్డాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రజలు చనిపోయారు" అని జాతీయ రవాణా భద్రతా బోర్డు వైస్- ఛైర్ ఉమెన్ బెల్లా డిన్హ్-జార్ తెలిపారు.
వాషింగ్టన్ రాష్ట్రంలో ఇటీవలే అమెరికా ప్రభుత్వం హై స్పీడ్ రైలు మార్గాన్ని నిర్మించింది. సోమవారం ఒక ఆమ్ట్రాక్ రైలు తొలిసారి ఆ మార్గంలో ప్రయాణించింది. ఒలంపియా సమీపంలో రోడ్డును దాటేందుకు నిర్మించిన వంతెనపై వెళ్తున్న సమయంలో రైలు 80 మైళ్ల వేగంతో ప్రయాణిస్తోంది. అసలు ఆ జోన్ లో 30 మైళ్ల కంటే ఎక్కువవేగం ప్రయాణించకూడదు. కానీ 80 మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ.. ఒక్కసారి పట్టాలు అదుపుతప్పింది. ఈ క్రమంలో బోగీలు కిందున్న రోడ్డుపై పడ్డాయి. ఈ ఘటనలో కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. కానీ మృతుల సంఖ్య పెరగవచ్చు. ఘటనలో గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.