Chicken Cooked in Cough Syrup: దగ్గు సిరప్‌తో చికెన్ రెసిపీ.. ఆరోగ్యానికి మంచిదేనా? డాక్టర్లు ఏం చెబుతున్నారో తెలుసా!!
Chicken Cooked in Cough Syrup: నైక్విల్ చికెన్ లేదా స్లీపీ చికెన్ అనే రెసిపీ యూఎస్‌లో టిక్‌టాక్‌లో ట్రెండ్ అవుతోంది. నైక్విల్ చికెన్ అంటే.. దగ్గు సిరప్‌తో చికెన్ వండటం.
Chicken Cooked in Cough Syrup: కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి గత రెండేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలోని శాస్త్రవేత్తలు మరియు వైద్యులు మహమ్మారిని అరికట్టడానికి ప్రయత్నిస్తున్నారు. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ (COVID-19 Vaccine) తీసుకున్నా కూడా ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. ప్రస్తుతం థర్డ్ వేవ్ (Third Wave) భయాందోళనలకు గురిచేస్తోంది. వైరస్ నుంచి తమను తాము రక్షించుకోవడం కోసం ప్రజలు తమ ఇళ్లలోనే పలు రకాల రెమెడీస్‌ని తయారుచేసుకుంటున్నారు. భారతదేశంలోని ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు కషాయాలను తాగుతున్నారు. విదేశాలలో కూడా ప్రజలు పలు రెసిపీలను తయారుచేసుకుంటున్నారు.
నైక్విల్ చికెన్ (NyQuil Chicken) లేదా స్లీపీ చికెన్ అనే రెసిపీ యూఎస్‌లో టిక్‌టాక్ (TikTok)లో ట్రెండ్ అవుతోంది. నైక్విల్ చికెన్ అంటే.. దగ్గు సిరప్‌తో చికెన్ వండటం. యూఎస్‌లో నైక్విల్ అనేది ఓ దగ్గు సిరప్ (Cough Syrup). ఆ మందుతో చికెన్ (Chicken)ను వండుతున్నారు. ఈ ట్రెండ్‌ను చూసి యూఎస్ డాక్టర్లు టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే దగ్గు సిరప్‌ను వేడి చేస్తే.. అది విషయంలా మారుతుందట. అందులోనూ దాన్ని చికెన్‌లో వేసి వండటం అంటే ఇంకా డేంజర్ అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
నైక్విల్ సిరప్‌తో వండిన చికెన్‌ను తింటే.. ఒకేసారి సగం బాటిల్ దగ్గు మందు తాగినట్టేనని యూఎస్ డాక్టర్లు స్పష్టం చేశారు. నైక్విల్ చికెన్ వల్ల లివర్ త్వరగా చెడిపోతుందని, వాంతులు కూడా అవుతాయని చెప్పారు. ఒక్కోసారి చనిపోయే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు హెచ్చరించారు. అయినా కూడా నైక్విల్ చికెన్ రెసిపీ ట్రెండ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ ట్రెండ్‌ను వెంటనే ఆపేయాలని టిక్‌టాక్‌ను నెటిజన్లు కోరుతున్నా.. కొందరు యూజర్లు మాత్రం అత్యుత్సాహంతో వీడియోలు చూసి మరీ దగ్గు మందుతో చికెన్ వండుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook