కరోనా మహమ్మారి గత 24 గంటల్లోనే అమెరికాలో 1,433 మందిని బలి తీసుకుంది. దీంతో అమెరికాలో కరోనా మరణాలు 42వేలకు చేరుకున్నాయి. కరోనా ప్రభావంతో అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయి. పలు కంపెనీలు మూతపడ్డాయి. చాలా కంపెనీలలో ఉద్యోగులను తొలగించారు, జీతాల్లో సైతం కోత విధించారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.  శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధరలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికాకు ఇమిగ్రేషన్‌ను తాత్కాలికంగా రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. అమెరికాలో 7,92,759 పాజిటివ్ కేసులు తేలగా, 42,514 మరణాలు సంభవించాయి. దీంతో కనిపించని శత్రువుతో అమెరికా పోరాటం చేస్తుందన్నారు. అదే సమయంలో అమెరికా పౌరులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి ఇమిగ్రేషన్ రద్దు చేస్తున్నట్లు సోమవారం అర్ధరాత్రి ట్రంప్ ప్రకటించారు.  బ్రేకింగ్: అమెరికాలో 42వేల కరోనా మరణాలు


దేశంలో కరోనా మరణాలు పెరిగిపోవడం, ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలతో అమెరికా తొలి స్థానంలో నిలిచిన కారణంగా విదేశీయులను ప్రస్తుతం అనుమతించకపోవడమే ఉత్తమమని ట్రంప్ భావిస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు విడుదలయ్యేంత వరకు విదేశాల నుంచి ఇమిగ్రేషన్ తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.  Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!


కాగా, నిరుద్యోగులకు లభించే పథకాలు, ప్రయోజనాల నిమిత్తం 2.2కోట్ల అమెరికా పౌరులు గతవారం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. భారతీయ ఐటీ ఫ్రొఫెషనల్స్‌కు హెచ్1బీ వీసాలు చాలా అవసరం. నాన్ ఇమిగ్రేషన్ వర్క్ వీసాలను సైతం మరికొన్ని రోజుల్లో నిలిపివేయనున్నట్లు వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos