Joe Biden: అగ్రరాజ్యం కొత్త అధ్యక్షుడు జో బిడెన్ ఇండియా ఫస్ట్ అంటున్నారు. ఇండియన్స్‌కు అగ్రతాంబూలమిస్తున్నారు. ఇద్దరు ప్రముఖ ఇండో అమెరికన్ వైద్యులకు ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కీలక స్థానాలు అప్పగించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికా(America) అధ్యక్షుడిగా జో బిడెన్ (Joe BIden)బాథ్యతలు చేపట్టిన తరువాత భారతీయులకు కీలక పదవులు అప్పగిస్తున్నారు. ఇండో అమెరికన్లకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా మరో ఇద్దరు భారతీయులకు కీలక పదవుల్లో నియమించారు జో బిడెన్. ఇద్దరు ప్రముఖ ఇండో అమెరికన్ వైద్యుల్ని తన ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కీలక స్థానాల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వెస్ట్ వర్జీనియా మాజీ హెల్త్ కమీషనర్ డాక్టర్ రాహుల్ గుప్తాను ఆఫీస్ ఆఫ్ ద నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీలో తదుపరి డైరెక్టర్‌గా నామినేట్ చేశారు. ఇక ప్రఖ్యాత సర్జన్, రచయిత అయిన అతుల్ గవాండేను యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్‌‌లో బ్యూరో ఫర్ గ్లోబల్ హెల్త్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించారు. 


జో బిడెన్ (Joe Biden)నియమించిన ఇద్దరు భారతీయ అమెరికన్ వైద్యుల (Indo american doctors)వివరాలు ఇలా ఉన్నాయి. రాహుల్ గుప్తా వెస్ట్ వర్జీనియా హెల్త్ కమీషనర్‌గా సేవలందించడమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ ప్రజారోగ్య పాలసీలపై పలు సంస్థలు, టాస్క్‌ఫోర్స్‌లకు అడ్వైజర్‌గా పనిచేశారు. ఇండియాలో పుట్టినా..అమెరికా పెరిగి అక్కడే స్థిరపడ్డారు. ఇక మరో భారతీయ వైద్యుడు అతుల్ గవాండే. ఈయన రాసిన ద చెక్‌లిస్ట్ మేనిఫెస్టో, బీయింగ్ మోర్టల్, కాంప్లికేషన్స్ వంటి పుస్తకాలు న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ బుక్స్ జాబితాలో చేరాయి.


Also read: Sputnik v vaccine effect: కోవిడ్ నుంచి కోలుకుంటే..స్పుత్నిక్ వి సింగిల్ డోసు చాలట


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook